Advertisementt

చరణ్ కోసమే గేమ్ ఛేంజర్ ప్లాన్ చేంజ్ ?

Tue 04th Apr 2023 01:47 PM
game changer,ram charan  చరణ్ కోసమే గేమ్ ఛేంజర్ ప్లాన్ చేంజ్ ?
Game Changer plan change for Charan? చరణ్ కోసమే గేమ్ ఛేంజర్ ప్లాన్ చేంజ్ ?
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సెట్స్ నుండి శంకర్ రీసెంట్ గానే కమల్ హాసన్ ఇండియన్ 2 సెట్స్ లోకి వెళ్ళినట్టుగా ట్వీట్ చేసారు. తైవాన్ లో ఇండియన్ 2 కొత్త షెడ్యూల్ మొదలు కాబోతున్నట్టుగా శంకర్ అప్ డేట్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో రామ్ చరణ్ భార్య ఉపాసనతో దుబాయ్ వెళ్ళిపోయాడు. అక్కడ కొద్దిరోజులు గడిపి రామ్ చరణ్ మళ్ళీ గేమ్ ఛేంజర్ షూటింగ్ లోకి ఎంటర్ అవుతాడు.

అయితే రామ్ చరణ్ బర్త్ డే రోజున గేమ్ ఛేంజర్ టైటిల్ అండ్ లుక్ తో పాటుగా రిలీజ్ డేట్ ఇస్తారు.. అది నిర్మాత దిల్ రాజు చెప్పినట్టుగా సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ నిలుస్తుంది అని మెగా ఫాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇవ్వకుండా ఫాన్స్ ని డిస్పాయింట్ చేసారు. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ప్లాన్ చేంజ్ అవడానికి కారణం చరణ్ అని తెలుస్తుంది.

రామ్ చరణ్ తన భార్య ఉపాసన డెలివరీ కోసం ఓ నెల షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి అమెరికా వెళ్ళబోతున్నాడని, అందుకే చరణ్ అందుబాటులో లేకపోతె గేమ్ ఛేంజర్ డేట్ ఇచ్చి ఇరుకునపడతామని శంకర్ అండ్ దిల్ గాజులు భావించారట. రామ్ చరణ్ అయితే కొద్దిరోజులపాటు భార్య డెలివరీ కోసం అమెరికా వెళ్లనున్నాడట. ఇప్పటికే ఉపాసన అమెరికాలో ఓ ఇల్లు కూడా రెంట్ కి తీసుకుంది అని, ఆస్కార్ కోసం వెళ్ళినప్పుడే ఉపాసన-చెర్రీ ఆ ఇంట్లోనే స్టే చేసినట్లుగా కొన్నిమీడియా ఛానల్స్ కథనాలు ప్రసారం చేసాయి కూడా.

Game Changer plan change for Charan?:

Game Changer plan change for Ram Charan?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ