సీతమ్మగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టించేసిన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఆ చిత్రంలో ట్రెడిషనల్ గా అద్భుత అనిపించింది. కట్టు, బొట్టు అచ్చం తెలుగమ్మాయిలా మృణాల్ కనిపించింది. ఆ పాత్ర స్వభావాన్ని వంటబట్టించుకోవడం, దుల్కర్ తో రొమాన్స్ అన్నీ అద్భుతమే అన్న రీతిలో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత మళ్ళీ అంత పద్దతిగా కనిపించలేదు. అంటే బాలీవుడ్ ఆఫర్స్ తో అందాల ఆరబోతలో నెక్స్ట్ లెవల్ చూపిస్తుంది. అక్షయ్ కుమార్ సెల్ఫీలో హద్దులు చెరిపేసి చెలరేగిపోయింది.
స్కిన్ షో తో హీటేక్కిస్తున్న మృణాల్ ఠాకూర్ తాజాగా వెకేషన్స్ లో మెరిసింది. సమ్మర్ వెకేషన్‌లో భాగంగా బీచ్‌లో సందడి చేసిన మృణాల్ బికినీలో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. వామ్మో ఆ పిక్స్ లో మృణాల్ ఠాకూర్ బికినీ వేసి అందాలు ఆరబోతకు దిగిపోయింది. ఇప్పటివరకు అందాలు ఎలా ఆరబోసినా.. ఇంత ఎక్కువగా అయితే చూపించలేదు. ఫస్ట్ టైమ్ ఇలా మృణాల్ రెచ్చిపోయి బికినీ షో చేసింది.
బ్లూ బికినీలో గ్లామర్ గేట్స్‌ను ఎత్తేసింది. మృణాల్ పోస్ట్ చేసిన పిక్స్ చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో లైక్‌లు, కామెంట్స్ కురిపిస్తున్నారు. యూత్ మొత్తం మృణాల్ ఠాకూర్ అందాలు గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదేమిట్రా బాబు.. సీతమ్మ ఇలా తెగించేసింది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.