ధమాకా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ మోత మోగించిన మాస్ రాజా రవితేజ.. తర్వాత నెల తిరక్కుండానే మెగాస్టార్ చిరు తో స్క్రీన్ షేర్ చేసుకుని వాల్తేర్ వీరయ్యతో మాస్ హిట్ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత మూడు నెలల గ్యాప్ లో రావణాసురతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. నేడు శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ రావణాసుర మీద ఆడియన్స్ లో ఆసక్తి కనిపించింది. బుక్ మై షో లో టికెట్స్ బుకింగ్ చూస్తే రావణాసుర ఓపెనింగ్స్ అదిరిపోతాయనిపించింది.
సుధీర్ వర్మ దర్శకత్వంలో అక్కినేని యంగ్ హీరో సుశాంత్ విలన్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ముగ్గురు నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. ఫారియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యువల్, మేఘ ఆకాష్. దక్ష నాగర్కర్ లాంటి హీరోయిన్స్ సందడి చేసారు. అయితే రవితేజ రావణాసుర తో హ్యాట్రిక్ అందుకుంటాడా అనే క్యూరియాసిటీ ఆయన అభిమానుల్లో మొదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్స్ షోస్ పూర్తి కాగా.. తెలుగు రాష్ట్రాల్లో మరికొద్దిసేపట్లో థియేటర్స్ లో సందడి మొదలు కాబోతుంది. హైదరాబాద్ మల్టిప్లెక్స్ లో ప్రెస్ షోస్ స్టార్ట్ అయ్యాయి.
ఓవర్సీస్ పబ్లిక్ టాక్ చూస్తే.. రావణాసుర మూవీ ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. రవితేజ కొత్తగా కనిపించాడు. క్రైజ్ సీక్వెన్స్ ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ అద్భుతంగా ఉంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఒప్పుకున్నందుకు రవితేజని అభినందించాలి అని ఓ నెటిజెన్ ట్వీట్ చేసాడు. మరో నెటిజెన్ మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ వల్ల రావణాసుర ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. రావణాసుర.. పక్కా మాస్ స్టఫ్ సెకెండాఫ్ రావణాసుర క్యారెక్టర్ వల్ల అద్భుతంగా ఉంది.. అంటూ ట్వీట్ చేసాడు. కొన్ని లాజిక్ లేని సీన్స్ ఇబ్బంది పెట్టినా, సెకెండాఫ్‌లో స్క్రీన్‌ప్లే ఎంగేజింగ్‌గా లేనప్పటికీ, హీరోయిన్స్ రోల్స్ అంతగా లేనప్పటికీ.. రవితేజ ఇరక్కుమ్మేసాడు అందుకే సినిమా ఓవరాల్ గా బావుంది అంటూ కొందరు ట్వీట్ చేస్తున్నారు.
మరి ఓవర్సీస్ టాక్, ట్విట్టర్ టాక్ చూస్తే రవితేజ మరో హిట్ ని ఖాతాలో వేసుకున్నట్టే అనిపిస్తుంది. ఫైనల్ గా రావణాసురకి పబ్లిక్ నుండి పాజిటివ్ టాక్ అయితే సొంతమైంది.