Advertisementt

అజిత్ తప్పులేదంటున్న విగ్నేష్ శివన్

Fri 07th Apr 2023 09:32 PM
vignesh shivan,ajith kumar,ak62  అజిత్ తప్పులేదంటున్న విగ్నేష్ శివన్
Vignesh Shivan opens up about being removed from Ajith movie అజిత్ తప్పులేదంటున్న విగ్నేష్ శివన్
Advertisement
Ads by CJ

నయనతార విగ్నేష్ శివన్ తో పెళ్లి తర్వాత తన రికమండేషన్ తో అజిత్ కి కథ చెప్పించి AK62 ని అజిత్-విగ్నేష్ శివన్ కలయికలో లైకా ప్రొడక్షన్స్ లో ఓకె చేయించి అధికారిక ప్రకటన వచ్చేలా చేసింది. విగ్నేష్ శివన్ కూడా అజిత్ తో మూవీ చేసేదుకు చాలా ఎగ్జైట్ అయ్యాడు. అయితే అజిత్ తూనీవు రిజల్ట్ తర్వాత విగ్నేష్ తో సినిమా చేసేందుకు వెనకడుగు వేశారు. విగ్నేష్ చెప్పిన కథ నచ్ఛలేదు, సెకండ్ హాఫ్ విషయంలో ఆయన తృప్తి పడకపోవడంతో AK62 ప్రాజెక్ట్ నుండి విగ్నేష్ శివన్ ని అజిత్ తప్పించారనే టాక్ నడిచింది.

ఆ తర్వాత అజిత్ పై నయన్ కి కోపమొచ్చింది. భర్తను అంతలా అవమానించిన అజిత్ తో ఇకపై నయనతార నటించనని శబదం చేసింది అంటూ ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా విగ్నేష్ శివన్ AK62 ప్రాజెక్ట్ నుండి తాను బయటికి రావడానికి కారణం అజిత్ కాదని.. నిర్మాణ సంస్థకే తాను చెప్పిన కథలోని సెకండ్ పార్ట్ నచ్చలేదని, ఆ అసంతృప్తి వలనే తనని ఆ ప్రాజెక్ట్ నుండి తప్పించారు, ఈ విషయంలో అజిత్ ది ఎలాంటి తప్పు లేదంటూ క్లారిటీ ఇచ్చాడు.

అంతేకాకుండా AK62కి అజిత్ ని ఇప్పుడు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించడం ఎంతో అందంగా ఉంది అని, ఓ అభిమానిగా అజిత్ సినిమాని ఎంజాయ్ చేస్తాను అంటూ అజిత్ పై విగ్నేష్ శివన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

Vignesh Shivan opens up about being removed from Ajith movie:

Vignesh Shivan confirms he is not directing Ajith Kumar AK62

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ