Advertisementt

ఏంజిల్ లా మారిపోయిన రకుల్

Sat 08th Apr 2023 04:31 PM
rakul preet  ఏంజిల్ లా మారిపోయిన రకుల్
Rakul Preet turned into an angel ఏంజిల్ లా మారిపోయిన రకుల్
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా టాలీవుడ్ లో వినిపించని పేరు రకుల్ ప్రీత్ సింగ్. కొండపొలం సినిమాతో వెనక్కితిరిగి చూడకుండా ముంబై లోనే సెటిల్ అయిన రకుల్ కి లక్కీగా ఇండియన్ 2 లో సెకండ్ హీరోయిన్ గా శంకర్ అవకాశం ఇచ్చారు. అంతేకాని ఇంకో సౌత్ ప్రాజెక్ట్ రకుల్ చేతిలో లేదు. బాలీవుడ్ సినిమాలతో సర్దుకుపోతూనే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా దాని గురించి సొషల్ మీడియాలో రిపోర్ట్ చేస్తుంది.

గ్లామర్ డ్రెస్సులతో.. అందాలు ఆరబోస్తూనే అందరి అటెన్షన్ తన మీద ఉండేలా చూసుకుంటుంది. ఇక బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో పబ్లిక్ గానే విహారయాత్రలకు, డేటింగ్స్ కి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి హాజరయ్యే రకుల్ ప్రీత్ ఈ మధ్యనే నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ ఈవెంట్ లో జాకీ తో కలిసి సందడి చేసింది. ఇక నిన్న బాలీవుడ్ లో జరిగిన ఓ అవార్డు వేడుకలో వైట్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసింది.

ఆ అవుట్ ఫిట్ లో అచ్చం ఏంజిల్ ని తలపించింది రకుల్ ప్రీత్ లుక్. ఆ మోడ్రెన్ డ్రెస్ లో కత్తిలాంటి చూపులతో రకుల్ అందాల ఆరబోత నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. హెయిర్ ముడి వేసి, మెడలో సింపుల్ లాకెట్ వేసుకుని రకుల్ దేవతలా దర్శనమిచ్చింది.

Rakul Preet turned into an angel:

Rakul Preet in White Dress with Cute and Awesome

Tags:   RAKUL PREET
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ