రామ్ చరణ్-ఉపాసనలు దుబాయ్ లో స్నేహితులు, సిస్టర్స్ మధ్యన సరదాగా గడుపుతూ ఉపాసన సీమంతం ఫంక్షన్ లో ఎంజాయ్ చేసారు. ఉపాసన సిస్టర్ తో పాటుగా, ఆమె పుట్టింటి వారు పాల్గొన్న ఈవెంట్ లో చరణ్-ఉపాసన దంపతులు వైట్ అండ్ వైట్ లో మెరిసిపోయారు. ఇక దుబాయ్ బీచ్ లో ఎంజాయ్ చేసిన ఈ జంట ఈరోజు శనివారం మాల్దీవుల ట్రిప్ కి వెళుతున్నారు. మాల్దీవులకు చరణ్-ఉపాసనలు వెళుతున్న ఎయిర్ పోర్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే రామ్ చరణ్ తో ఆర్.ఆర్.ఆర్ లో జోడి కట్టిన బాలీవుడ్ చిన్నది అలియా భట్ రామ్ చరణ్-ఉపాసనలకు పుట్టబోయే బిడ్డ కోసం తన క్లోతింగ్ బ్రాండ్ నుండి కొన్ని దుస్తులు పంపింది. ఇంతకు ముందు ఎన్టీఆర్ కొడుకు భార్గవ్, అభయ్ రామ్ లకి దుస్తులు పంపిన విషయాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో అందరితో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు త్వరలోనే మెగా ఫ్యామిలోకి రాబోయే రామ్ చరణ్ బిడ్డ కోసం అలియా భట్ పంపిన గిఫ్ట్ కి ఉపాసన థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టింది.
ఉపాసనకి ఇప్పుడు ఏడో నెల. మరికొద్ది నెలల్లో చరణ్ దంపతులు పండంటిబిడ్డని చేతుల్లోకి తీసుకుంటారు. ఈలోపే అలియా భట్ తన కంపెనీ నుండి కొత్త దుస్తులు గిఫ్ట్ గా పంపింది. ఇక రామ్ చరణ్-ఉపాసన మాల్దీవుల ట్రిప్ ముగియగానే.. ఉపాసనకు మెగా ఫ్యామిలీ సీమంతం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.