Advertisementt

బావా అంటూ NTR-బన్నీ ఫన్నీ కాన్వర్జేషన్

Sat 08th Apr 2023 09:50 PM
ntr and allu arjun funny conversation  బావా అంటూ NTR-బన్నీ ఫన్నీ కాన్వర్జేషన్
NTR Wishes to Allu Arjun బావా అంటూ NTR-బన్నీ ఫన్నీ కాన్వర్జేషన్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-అల్లు అర్జున్ మధ్యన స్నేహం అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్ లో చూడడమే కానీ.. బయట వారు కలుసుకున్న సందర్భాలు పెద్దగా తెలీవు. రామ్ చరణ్ అంటే.. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ లాంటి స్టార్స్ తో స్నేహం చేస్తున్నట్లుగా బయటికి ఎక్స్పోజ్ అయినా.. అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో ఎక్కువగా ఫ్యామిలీతోనే కనిపిస్తాడు. అయితే ఎన్టీఆర్-అల్లు అర్జున్ చాలా క్లోజ్ అనేది కొంతమందికే తెలుసు. 

ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సాయంత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ Wishing you a Very Happy Birthday Bava @alluarjun. Have a great one !! విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్ డే బావా అల్లు అర్జున్ అంటూ లవ్లీగా విషెస్ చెప్పాడు. కొద్దిసేపటికి అల్లు అర్జున్ ఎన్టీఆర్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. థాంక్యూ ఫర్ యువర్ లవ్లీ విషెస్ బావా.. వార్మ్ హగ్స్.. అంటూ రీ ట్వీట్ చేసాడు. దానికి మళ్ళీ ఎన్టీఆర్ ఫన్నీగా రిప్లై ఇస్తూ.. Only hugs? Party Leda Pushpa? 🤣 ఓన్లీ హగ్స్ ఏనా? పార్టీ లేదా పుష్పా అంటూ చేసిన ట్వీట్ కి అల్లు అర్జున్ మళ్ళీ వస్తున్నా అంటూ రిప్లై ఇవ్వడం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది.

ఎన్టీఆర్-అల్లు అర్జున్ ల ఈ బర్త్ డే ఫన్నీ కాన్వర్జేషన్ చూసిన ఎన్టీఆర్ ఫాన్స్-అల్లు ఫాన్స్ మురిసిపోతున్నారు. ఇప్పటివరకు రామ్ చరణ్ తోనే స్నేహాన్ని మెయింటింగ్ చేస్తూ హైలెట్ అయిన ఎన్టీఆర్ ఇప్పుడు అల్లు అర్జున్ తోనూ ఇంత క్లోజ్ గా ఉండడం చూసి వారు హ్యాపీగా ఫీలవుతున్నారు. కొంతమంది ఎన్టీఆర్-అల్లు అర్జున్ ల ట్వీట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

NTR Wishes to Allu Arjun:

Ntr and Allu Arjun funny conversation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ