మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కోసింది. అలాగే చాలా గ్యాప్ తర్వాత వింటేజ్ మెగాస్టార్‌ని చూశామంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఈ సినిమా విడుదలై దాదాపు 3 నెలలు కావస్తుంది. థియేటర్లలో నుంచి వెళ్లిపోయి.. ఓటీటీలో సందడి చేస్తుంది. అలాంటిది.. ఈ టైమ్‌లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాపై, ఆ చిత్ర యూనిట్‌పై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు శృతిహాసన్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ వేడుకకు ఒక రోజు ముందు జరిగిన ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకకు శృతి హాజరైంది కానీ.. చిరంజీవి సినిమా ఫంక్షన్‌కు ఆమె రాలేదు. ఆరోగ్యం బాగా లేదంట అని చెబుతూ.. సరదాగా శృతిపై చిరు ఆ ఫంక్షన్‌లో కామెంట్స్ కూడా చేశారు. ఆ తర్వాత ఆ కామెంట్స్‌పై ట్రోలింగ్ కూడా జరిగిందనుకోండి. అయితే ‘వీరయ్య’ ఫంక్షన్‌కు శృతి రాకపోవడానికి కారణం ఆమె అనారోగ్యం కాదనేది.. తాజాగా ఆమె ఆ సినిమాపై చేసిన కామెంట్స్‌తో తెలుస్తోంది.
‘‘మంచులో డ్యాన్స్ చేయడం చాలా కష్టం. హీరోలు చలిని ఆపే జాకెట్స్ వేసుకుంటారు. కానీ మాకు జాకెట్, కోట్, కనీసం శాలువ కూడా ఇవ్వరు. కేవలం శారీ, జాకెట్ వేసుకుని ఆ మంచులో డ్యాన్స్ చేయాలి. దయచేసి హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే నేను ఇది రీసెంట్‌గానే అనుభవించాను’’ అని శృతిహాసన్ చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో శృతి చేసిన కామెంట్స్ చూసిన వారంతా.. అందుకే వీరయ్య విషయంలో శృతి ముఖం చాటేసిందని అనుకుంటున్నారు. ఈ వీడియోపై కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. 15, 20 నిమిషాల పాత్ర కోసం కోటాను కోట్లు తీసుకుంటున్న నువ్వు ఆ మాత్రం చేయలేవా? అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు.
Shes got a point🤷♂️… pic.twitter.com/VuFU5INajT
— Aryan (@Pokeamole_) April 8, 2023