మొన్న మార్చ్ 27న రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లోనే మెగాస్టార్ నివాసంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పార్టీకి రాజమౌళి, బాలీవుడ్ తారలు కియారా అద్వానీ ఆమె భర్త సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రానా, అక్కినేని ఫామిలీ హాజరవగా ఈ వేడుకలో అల్లు అర్జున్ కనిపించకపోవడంపై అటు మెగా ఫాన్స్, ఇటు అల్లు ఫాన్స్ ఫీలయ్యారు. మెగా ఫాన్స్ అయితే అల్లు అర్జున్ ని తిట్టుకున్నారు కూడా.
అదే సమయంలో అల్లు అర్జున్ తన భార్య స్నేహ, ఇంకా చరణ్ సిస్టర్స్, ఇంకొంతమంది కజిన్స్ తో వెకేషన్స్ కి వెళ్లడంతో చరణ్ పార్టీకి హాజరుకాలేదు. ఇప్పుడు బన్నీ పార్టీలో చరణ్ మిస్ అయ్యాడు. రామ్ చరణ్ ప్రస్తుతం భార్య ఉపాసనతో కలిసి వెకేషన్స్ లో ఉన్నాడు. ఈమధ్యనే దుబాయ్ వెళ్లిన చరణ్.. ప్రస్తుతం ఉపాసనతో కలిసి మాల్దీవ్స్ కి వెళ్ళాడు. అక్కడ మాల్దీవ్స్ లో ఓ వారం చరణ్ దంపతులు గడపబోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకే గత రాత్రి అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన పార్టీకి చరణ్ హాజరవలేదు.
ఈ పార్టీలో బన్నీ వైఫ్ స్నేహ రెడ్డి హీరోయిన్ లా రెడీ అయ్యింది. ఈ వేడుకలో కొంతమంది స్టార్స్ పాల్గొన్నారు. ఇక మెగా ఫాన్స్ అప్పుడు అల్లు అర్జున్ మిస్ అయ్యాడు, ఇప్పుడు ఆయన బర్త్ డే కి చరణ్ మిస్ అయ్యాడంటూ సరిపెట్టుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ పార్టీలో చరణ్ సిస్టర్స్ శ్రీజ, సుష్మితలు హడావిడి చేసారు.