పవన్ కళ్యాణ్ తో విడిపోయిన రేణు దేశాయ్ ని పవన్ ఫాన్స్ చాలా ద్వేషించారు. ఆమె రెండో వివాహం చేసుకోబోతుంది అని తెలుసా ఆమెని ట్రోల్ చేసారు. విడాకుల విషయంలో పవన్ ది తప్పా లేదంటే రేణు దేశాయ్ ది తప్ప అనేది వారికి అనవసరం. కానీ రేణు దేశాయ్ ఏం చేసినా పవన్ ఫాన్స్ కి నచ్చదు. ఆమెని విమర్శిస్తారు. తాజాగా అకీరా నందన్ బర్త్ డే జరిగింది. నిన్న ఏప్రిల్ 8 అకీరా నందన్ పుట్టిన రోజు. అతనికి 19 ఏళ్ళు పూర్తి కావడంతో ఆయన సినిమా ఎంట్రీపై పవన్ ఫాన్స్ ఆతృతగా ఉన్నారు.
అకీరా నందన్ పబ్లిక్ లో పెద్దగా ఫోకస్ అవ్వడు. తండ్రి పవన్ తోనూ ఎక్కువగా కనిపించడు. దానితో పవన్ ఫాన్స్ అకీరా లేటెస్ట్ లుక్ కోసం తెగ వెతికేస్తారు. పొరపాటున అతని ఫోటో దొరికితే ట్రెండ్ చేస్తారు. అయితే అకీరా బర్త్ డే సందర్భంగా పవన్ ఫాన్స్ ఒకరు.. మా అన్న కొడుకుని చూడాలని మాకు ఉంటుంది.. మీరు ఇలా దాచి పెట్టకండి.. అప్పుడప్పుడు అయినా ఫొటోస్, వీడియోలో అకీరా బాబుని చూపించండి అంటూ రేణు దేశాయ్ ని టాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు.
పవన్ కొడుకు అకీరా అనేసరికి రేణు దేశాయ్ కి మండింది. దానితో మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా.. మీరు ఆయనకు హార్డ్ కొర్ ఫాన్స్ అయ్యుండొచ్చు, నేను అర్థం చేసుకుంటాను. ముందు మీరు పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోండి. ఇలాంటి మెసేజ్‌లను పట్టించుకోవటం పూర్తిగా మానేశాను. అయినా మీరు నన్ను కెలుకుతూ హద్దులను దాటుతున్నారు.
నా సోషల్ మీడియాలో అకీరా బర్త్ డే రోజు నెగెటివ్ కామెంట్స్ పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. గత 11 ఏళ్లుగా నేను మిమ్మలని అర్ధం చేసుకుంటూనే ఉన్నాను, ఓ తల్లిగా ఎప్పుడూ హర్ట్ అవుతున్నాను. అసలు మీ సమస్య ఏమిటో నాకు అర్థం కావటం లేదు అంటూ రేణు దేశాయ్ ఆ ఫ్యాన్ కి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.