ఏడాదిన్నర క్రితం నాగ చైతన్య కి సమంత విడాకులిచ్చి అక్కినేని ఫ్యామిలీతో డిస్టెన్స్ మెయింటింగ్ చేస్తుంది. అప్పటినుండి అక్కినేని ఫ్యామిలీ సమంతని పట్టించుకోవడం లేదు. దగ్గుబాటి ఫ్యామిలిలో రానా, వెంకీ కూతురు ఆశ్రీత మాత్రం సామ్ తో టచ్ లోనే ఉంటున్నారు. ఇక అన్నతో పెళ్లి తర్వాత అఖిల్ సమంతతో బాగా క్లోజ్ అయ్యాడు. పార్టీలు, పబ్ లు అంటూ అందరూ కలిసి ఎంజాయ్ చేసారు. అయితే విడాకుల తర్వాత సమంత గత ఏడాది అఖిల్ కి బర్త్ డే విషెస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ అఖిల్ దానికి రిప్లై ఇవ్వలేదు.
ఇక నిన్న ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా హ్యాపీ బర్త్ డే అఖిల్ అక్కినేని అంటూ బర్త్ డే విషెస్ ని ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చెయ్యడమే కాకుండా.. ఏజెంట్ పోస్టర్ ఏప్రిల్ 28 న ఫైర్ అంటూ అఖిల్ కి విషెస్ తెలియజేసింది. అయితే అందరూ ఈసారైనా అఖిల్ సమంత కి రిప్లై ఇస్తాడా అని ఎదురు చూసారు. ఎదురు చూసినట్టుగానే అఖిల్ సమంత ట్వీట్ కి స్వీట్ రిప్లై ఇచ్చాడు.
థాంక్యూ సో మచ్ సామ్.. నీ అంచనాలను అందుకుంటానని అనుకుంటున్నాను అంటూ హార్ట్ ఎమోజిని షేర్ చేసాడు. దానితో అటు అఖిల్ ఫాన్స్, ఇటు సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.