Advertisementt

టాలీవుడ్ స్పెషల్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ

Mon 10th Apr 2023 04:26 PM
urvashi rautela,agent  టాలీవుడ్ స్పెషల్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ
Urvashi Rautela performs an item song in Agent టాలీవుడ్ స్పెషల్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేల్ల అక్కడ పెద్ద హీరోయిన్ అవ్వుద్ది అనుకున్నారు. ఎందుకంటే హీరోయిన్స్ కి ఉండే ఫిగర్, అంత గ్లామర్ ఈ బ్యూటీకి ఉన్నప్పిటికి.. ఉర్వశికి మాత్రం లక్కు కలిసి రాలేదు. అక్కడ చిన్న చితక సినిమాల్లో నటిస్తూనే ఈవెంట్స్ కి, అవార్డ్స్ ఫంక్షన్స్ కి అదిరిపోయేలా రెడీ అయ్యి అందాలు ఆరబోస్తుంది. అయితే క్రికెటర్ రిషబ్ పంత్ విషయంలో సోషల్ మీడియాలో హైలెట్ అయ్యే ఊర్వశి ఇప్పుడు టాలీవుడ్ హీరోలకి స్పెషల్ గా మారిపోయింది.

ఇప్పటికే ఊర్వశి రౌతేల్ల మెగాస్టార్ చిరూతో వాల్తేర్ వీరయ్య చిత్రంలో స్పెషల్ ఐటెం సాంగ్ చేసింది. బాస్ పార్టీ అంటూ గ్లామర్ గా రెచ్చిపోయింది. ఇప్పుడు ఇదే బ్యూటీ అఖిల్ అక్కినేని ఏజెంట్ లోను స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేయబోతుంది అని తెలుస్తుంది. స్పెషల్ సెట్ లో మొదలుకాబోయే సాంగ్ షూట్ లో ఊర్వశి జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అఖిల్ హైట్ కి ఊర్వశి అయితే అదిరిపోతోంది, పాన్ ఇండియా మైలేజ్ కూడా వస్తుంది అని సురేందర్ రెడ్డి ఆమెని దించుతున్నాడట.

ఇలా టాలీవుడ్ హీరోలతో స్పెషల్ సాంగ్స్ లో నర్తిస్తూ టాలీవుడ్ కి స్పెషల్ ఐటెం గర్ల్ లా మారిపోయింది. అన్నట్టు ఊర్వశి సంపత్ నంది చిత్రంలో ఓ హీరోయిన్ గా కూడా నటించింది. అసలు ఆ సినిమా అప్ డేట్ లేనే లేదు.

Urvashi Rautela performs an item song in Agent:

Urvashi Rautela to shake a leg with Agent

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ