Advertisementt

సితార-గౌతమ్ లతో మహేష్ క్యూట్ పిక్

Tue 11th Apr 2023 01:56 PM
mahesh babu,namrata shirodkar  సితార-గౌతమ్ లతో మహేష్ క్యూట్ పిక్
Namrata shares new pic of Mahesh Babu with kids సితార-గౌతమ్ లతో మహేష్ క్యూట్ పిక్
Advertisement
Ads by CJ

సితార-నమ్రతలు గత నెల అంటే మార్చ్ మిడిల్ లోనే పారిస్ ట్రిప్ కి వెళ్లారు. గౌతమ్ కి ఎగ్జామ్స్, మహేష్ కి SSMB28 షూటింగ్ షెడ్యూల్ ఉండడంతో నమ్రత, సితారలు మాత్రమే పారిస్ వెళ్లారు. అక్కడ నమ్రత సిస్టర్, వాళ్ళ అమ్మాయితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మహేష్ కి ఇక్కడ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అవడంతో మహేష్, గౌతమ్ కలిసి ఏప్రిల్ 6న ఫ్లైట్ ఎక్కారు. నమ్రత వాళ్లతో జాయిన్ అయ్యారు. అక్కడ పారిస్ నుండి మహేష్ ఫ్యామిలీ స్విజ్జర్లాండ్ వెళ్ళింది. ప్రస్తుతం మహేష్ అలాగే పిల్లలు, నమృత స్విస్ అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

నమ్రత తాజాగా మహేష్-గౌతమ్, సితారల పిక్ తీసి సోషల్ మీడియా ఇన్స్టాలో షేర్ చేస్తూ.. My 3 Musketeers back together అంటూ క్యాప్షన్ పెట్టింది. ఆ పిక్ లో మహేష్ వైట్ అండ్ వైట్ లో కనిపించగా.. గౌతమ్ తండ్రి మహేష్ కన్నా హైట్ గా కనిపించాడు. మహేష్-సితార-గౌతమ్ లు కలిసి ముచ్చటించుకుంటున్నారు. ఆ పిక్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ ఫ్యామిలీ ఈ నెల చివరి వరకు స్విస్ లోనే గడపనున్నట్లుగా తెలుస్తుంది.

మహేష్ హైదరాబాద్ తిరిగిరాగానే.. మహేష్ ఇంకా పూజ హెగ్డే, శ్రీలీల కలయికలో దర్శకుడు త్రివిక్రమ్ కొన్ని కీలక సన్నివేశాల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. SSMB28 లో మహేష్ కి విలన్ గా జగపతి బాబు కనిపించబోతున్నారు.

Namrata shares new pic of Mahesh Babu with kids:

Namrata Shirodkar shares picture of her three Musketeers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ