జబర్దస్త్ అవినాష్ ని ఇప్పుడు అల్లు అర్జున్ ఫాన్స్ వెంటాడుతున్నారు. కారణం అవినాష్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ గెటప్ లో కనిపించడమే.. అదేమిటి పుష్ప గెటప్ వేస్తె కొడతారా ఏంటి అనుకునేరు.. ఈమధ్యన అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప గా అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ చీర, గాజులు, బొట్టు పెట్టి ఉగ్రరూపంలో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జబర్దస్త్ అవినాష్ అదే లుక్ ని ట్రై చేసి అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెప్పడమే అల్లు ఫాన్స్ కి నచ్చలేదు.. దానితో అవినాష్ కి మూడింది.
అవినాష్ అల్లు అర్జున్ లా అమ్మవారి గెటప్ వేసి దానిని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. పుష్ప 2 లుక్‌ని ఇమిటేట్ చేస్తూ.. అరకొర ఎడిటింగ్‌తో అతను కూడా పుష్పరాజ్ మాదిరి మారిపోవడం అల్లు ఫాన్స్ కి మాంటెత్తేలా చేసింది. నుదుటున బొట్టు, కనుబొమ్మల పైన, చుట్టూ తెల్లటి బొట్లు, చెవి దిద్దులతో, చేతులకి గాజులతో అవినాష్ పిచ్చెక్కించాడు. కానీ అది అల్లు అర్జున్ ఫాన్స్ కి నచ్చకపోవడంతో.. ముందా ఫోటో డిలేట్ చేయమంటూ అవినాష్ కి వార్నింగ్ ఇస్తున్నారు.
ఇప్పటికే అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ పై మిక్స్డ్ రెస్పాన్స్ తో నలిగిపోతున్న అల్లు ఫాన్స్.. ఇప్పుడు అవినాష్ అలా కనిపించడంతో.. కొంతమంది యాంటీ ఫాన్స్ అల్లు అర్జున్ కన్నా అవినాషే బావున్నాడంటూ చేస్తున్న కామెంట్స్ కి వారు మరింతగా రగిలిపోతున్నారు. అందుకే అవినాష్ ని అర్జెంట్‌గా ఆ పిక్ డిలీట్ చేయకపోతే నీకు పగిలిపోద్దిరో అంటూ వార్న్ చేస్తున్నారు వారు.