Advertisementt

ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షన్ లేదు

Tue 11th Apr 2023 09:47 PM
war 2,jr ntr,aditya chopra  ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షన్ లేదు
There is no other option but NTR ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షన్ లేదు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ నుండి ఆదిత్య చోప్రా నిర్మాణంలో ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో హ్రితిక్ రోషన్ హీరోగా తెరకెక్కనున్న వార్ 2 మూవీ కోసం ముందుగా ప్రభాస్ ని అనుకున్నారు. కానీ ప్రభాస్ వార్ 2 లో నటించను అని చెప్పడంతోనే.. మరికొంతమంది హీరోలని సంప్రదించాకే ఆదిత్య చోప్రా-ఆయన్ ముఖర్జీలు ఎన్టీఆర్ ని కలిసి ఆ పాత్ర కోసం ఒప్పించారంటూ.. అసలు వార్ 2 లో మొదటి ఛాయస్ ఎన్టీఆర్ కాదంటూ రకరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ కాంబోని ప్రకటించగానే ఏర్పడిన అంచనాలు, క్రేజ్ అన్ని ఈన్యూస్ చూసాక ఫాన్స్ ని డిస్పాయింట్ చేసాయి. దానితో వార్ 2 మేకర్స్ అదిర్య చోప్రా ఈ రూమర్స్ పై స్పందించినట్లుగా తెలుస్తుంది. అసలు హృతిక్ తో పాటు వార్ 2 కోసం మరొక హీరో పాత్రని కేవలం ఎన్టీఆర్ మాత్రమే చేయగలరని, అలానే నిర్మాత ఆదిత్య చోప్రా కూడా ఎన్టీఆర్ డేట్స్ కోసం ఐదు నెలలుగా ఎదురుచూశారని తెలుస్తోంది. ఫైనల్ గా ఎన్టీఆర్ డేట్స్ లభించడంతో ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా ప్రకటించారని సమాచారం.

హ్రితిక్ రోషన్-ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 ఈ ఏడాది నవంబర్ నుండి మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో భారీగా ఈ ప్రాజెక్టు మొదలు కాబోతుంది అని.. ఎన్టీఆర్ కేరెక్టర్ వార్2 లో నెగెటివ్ ఛాయలు ఉండొచ్చు అని కూడా అనుకుంటున్నారు. 

There is no other option but NTR:

War 2: Jr NTR Was Aditya Chopra First And Only Choice

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ