Advertisementt

యాంకర్ సుమను అరెస్ట్ చేశారు

Thu 13th Apr 2023 03:51 PM
anchor suma,arrest,anchor suma arrested,tollywood anchor  యాంకర్ సుమను అరెస్ట్ చేశారు
Shocking Anchor Suma Arrested యాంకర్ సుమను అరెస్ట్ చేశారు
Advertisement
Ads by CJ

తన యాంకరింగ్‌తో అందరి మనసులను దోచేసే యాంకర్ సుమను అరెస్ట్ చేశారు. ఎందుకు ఆమెను అరెస్ట్ చేశారు? ఏం నేరం చేసిందని అరెస్ట్ చేశారు? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో యాంకర్ సుమను అరెస్ట్ చేసి.. కారులో తీసుకెళుతున్నట్లుగా ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన వారంతా.. ఏమైంది? అంటూ ఒకటే కామెంట్లు. అయితే యాంకర్ సుమను అరెస్ట్ చేసేంత తప్పు, నేరం ఆమె ఏం చేసి ఉంటుంది? ఇదేదో సినిమా ప్రమోషన్ అయి ఉంటుందనేలా కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

వారు కామెంట్స్ చేస్తున్నట్లుగానే.. ఇది సినిమాకు సంబంధించిన ప్రచారమే. ఈ మధ్య సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు.. మేకర్స్ నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్య విశ్వక్ సేన్ తన సినిమా కోసం ఒక పెద్ద యుద్ధమే చేశాడు. అలాంటిదే ఇది కూడా. అందరిలా సినిమాలో నటించిన వాళ్లు యాక్ట్ చేస్తే కిక్ ఏముంటుంది? అందుకే సుమతో ఈసారి పని కానిచ్చేశారు. 

విషయంలోకి వస్తే.. ఇదంతా అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమా కోసం చేసిన ప్రచారంగా తెలుస్తుంది. ఆ సినిమా నేపథ్యం మొత్తం ఇలా అరెస్ట్‌లతోనే ఉంటుందనేది.. చిత్ర టీజర్ చూస్తుంటేనే తెలుస్తుంది. ఇప్పుడా సినిమా విడుదలకు దగ్గర పడటంతో.. మేకర్స్ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం ఇలా సుమను అరెస్ట్ చేసినట్లుగా ఓ పిక్‌ని అంతర్జాలానికి వదిలారు. అంతే.. ఒక్కసారిగా సుమను ఎందుకు అరెస్ట్ చేశారనే విషయం తెలుసుకునే క్రమంలో.. సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తుంది.

Shocking Anchor Suma Arrested:

Reasong Behind Anchor Suma Arrest

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ