Advertisementt

శ్రీలీల ఓకె.. మరి పవన్ సంగతో..

Sat 15th Apr 2023 10:49 AM
pawan kalyan,sreeleela,ustad bhagat singh  శ్రీలీల ఓకె.. మరి పవన్ సంగతో..
Pawan Kalyan and Sreeleela Mass Song శ్రీలీల ఓకె.. మరి పవన్ సంగతో..
Advertisement
Ads by CJ

శ్రీలీల డాన్స్ కి టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు.. టాలీవుడ్ యంగ్ హీరోలంతా ఫిదా అయ్యారు. అందుకే శ్రీలీలకి వరస అవకాశాలు ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం అరడజను కాదు ఏకంగా ఎనిమిది ప్రాజెక్ట్స్ శ్రీలీల చేతిలో ఉండగా.. ఇద్దరు స్టార్ హీరోలతో ఒకేసారి స్క్రీన్ షేర్ చేసుకుంటూ రికార్డ్ క్రియేట్ చేసింది. మహేష్ బాబు-పవన్ కళ్యాణ్ తో వేరు వేరు సినిమాల్లో ఒకేసారి నటిస్తుంది. అయితే ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి జాయిన్ అయిన శ్రీలీలతో పవన్ కళ్యాణ్ కి మాస్ సాంగ్ పెట్టమంటూ ఓ అభిమాని హరీష్ శంకర్ ని కోరాడు.

దానితో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్-శ్రీలీల కి ఓ మాస్ బీట్ ఉంటుంది అని మాటిచ్చేసారు. మరి శ్రీలీల మాస్ డాన్స్ ఇరగదీస్తుంది. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. శ్రీలీల ఎనర్జిటిక్ డాన్స్ లకే ధమాకా హిట్ అయ్యి రవితేజ ని నిలబెట్టింది. ఇప్పుడు కూడా డాన్స్ లో శ్రీలీల ఇరగదీస్తోంది కానీ.. పవన్ కళ్యాణ్ శ్రీలీలతో డాన్స్ చెయ్యగలరా.. ఆయనకసలే మొహమాటం. అందులోను మాస్ డాన్స్ చేసే సత్తా పవన్ లో లేదు అనేది కొందరి అభిప్రాయం.

మరి శ్రీలీల-పవన్ కళ్యాణ్ మధ్యలో మాస్ బీట్ ఉంటే థియేటర్స్ లో విజిల్స్ ఖాయమే. శ్రీలీల మాస్ స్టెప్స్ చూడడానికి జనం ఎగబడతారు.. కానీ పవన్ విషయమే ఇప్పుడు అందరిలో అనుమానం రేపుతోంది. చూద్దాం పవన్ శ్రీలీల పక్కన ఎలా మ్యానేజ్ చేస్తారో అనేది.

Pawan Kalyan and Sreeleela Mass Song :

Pawan Kalyan and Sreeleela Mass Song in Ustad Bhagat Singh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ