కన్నడ మూవీ పాన్ ఇండియా మార్కెట్ లో కోట్లు కొల్లగొట్టి రిషబ్ శెట్టి ని నేషన్ స్టార్ ని చేసిన కాంతార మూవీకి కోలుకోలేని షాకిచ్చింది కేరళ హై కోర్టు. కాంతార సినిమాకి ఆయువు పట్టు మీద కొట్టింది కోర్టు. ఆ సినిమాలో వరాహ రూపం సాంగ్ ని కాపీ కొట్టారంటూ తాయికూడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేస్తూ కోర్టు కెక్కింది. ఆ కేసు విచారణ చేపట్టిన కేరళ కోర్టు.. వరాహ రూపం సాంగ్ పై తాయికూడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు కొట్టిపారేసింది. కొన్నాళ్ళు ఆ పాటని తీసేసిన మేకర్స్ మళ్ళీ వరాహ రూపం సాంగ్ ని యాడ్ చేసారు.
కానీ ఇప్పుడు కేరళ హై కోర్టు ఈ సాంగ్‌ను థియేటర్స్‌లో, డిజిటల్ మాధ్యమాల్లో ఉపయోగించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వరాహ రూపం సాంగ్ విషయంలో చిత్ర బృందం ప్రాథమిక కాపీ రైట్స్ చట్టాన్ని ఉల్లంఘించిందని అందువలనే ఆ పాటపై నిషేధం విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. కేసుకి సంబంధించిన ఆధారాలను మే 4లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులని కోర్టు ఆదేశించింది.
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ కాంతారకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మేకర్స్ 16 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 450 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఆ చిత్ర విజయాన్ని రిషబ్ శెట్టి ఇంకా కంటిన్యూ చెయ్యడమే కాదు.. కాంతారకు ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కాంతార ప్రీక్వెల్ టీమ్ ఉంది.