మారుతి తో ప్రభాస్ సినిమా చేసే విషయంలో ప్రభాస్ ఫాన్స్ నుండి తీవ్ర వ్యతిరేఖత ఉంది. అందుకే మారుతి గుట్టు చప్పుడు కాకూండా ప్రభాస్ మూవీ మొదలు పెట్టేసి కామ్ గా షూటింగ్ చేసేసుకుంటున్నాడు. ప్రభాస్ తో డార్లింగ్, బుజ్జిగాడు లాంటి సినిమా చేసి.. తన అభిమానాన్ని చాటుకోవాలని మారుతి అనుకున్నాడు, అన్నాడు కూడా. కానీ మారుతి దర్శకత్వంపై ప్రభాస్ ఫాన్స్ కి ఇసుమంతైనా నమ్మకం లేదు. ఎందుకంటే ఆయనకి అంత పెద్ద డిజాస్టర్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పటివరకు ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టని దర్శకుడితో ప్రభాస్ సినిమా చెయ్యడం ఫాన్స్ కి నచ్ఛలేదు.
అయితే తాజాగా మేకర్స్ లీక్ చేసారో.. నిజంగానే లీక్ జరిగిందో.. ప్రభాస్-హీరోయిన్ రిద్ది కుమార్ షూటింగ్ పిక్ లీక్ అయ్యింది. అందులో ప్రభాస్ గుబురు గెడ్డంతో వింటేజ్ లుక్ లో కొద్దిగా కొత్తగా కనిపించారు. ఇది చూసిన ప్రభాస్ ఫాన్స్ మారుతి దర్శకత్వంపై ఉన్న వ్యతిరేఖతని తగ్గించుకుని ప్రభాస్ లీకెడ్ పిక్ కి ఇంప్రెస్స్ అయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ లుక్స్ పై బాహుబలి దగ్గర నుండి వారికి కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మారుతి మూవీ రాజా డీలక్స్ లీకెడ్ పిక్ లో ప్రభాస్ లుక్ చూసి ఫాన్స్ కూల్ అయ్యారట.
అయితే మేకర్స్ ఇలాంటి లీకులు కావాలానే చేస్తున్నారని, దానితో ఫాన్స్ లో ఉన్న వ్యతిరేఖతని పోగొట్టే ప్రయత్నాల్లో భాగంగా చేసే లీకులతో వారి వ్యతిరేఖతని తగ్గించొచ్చు అని. ఇప్పుడు నిజంగానే వారి ప్లాన్ వర్కౌట్ అయ్యింది అంటున్నారు. మరి ప్రభాస్, మారుతి లీకెడ్ పిక్ మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.