రాజమౌళికి బ్యాక్ బోన్ గా ఆయన ఫ్యామిలీ ఉంటుంది. ముఖ్యంగా ఆయన కొడుకు కార్తికేయ ఉంటాడు. కార్తికేయ కష్టానికి ఫలితమే ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు పాటకి ఆస్కార్ రావడడానికి కారణం. అమెరికాలో ఆర్.ఆర్.ఆర్ పాటని ఆస్కార్ నామినేషన్స్ వరకు తీసుకెళ్లడానికి కార్తికేయ పడిన కష్టం ఎంతుందో కార్తికేయ మాటల్లో వినిపిస్తున్నాడు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తికేయ ఆ సాంగ్ ఆస్కార్ కి వెళ్ళడానికి పెట్టిన ఖర్చు, అలాగే రాజమౌళి ఫ్యామిలీలోకి అతనెలా వచ్చాడో.. రాజమౌళి తనకి బాబా ఎలా అయ్యారో అన్ని ఆ ఇంటర్వ్యూలో వివరించాడు.
ఆర్.ఆర్.ఆర్ కి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కార్తికేయ రాజమౌళికి ఓన్ సన్ కాదు. రమకి మొదటి భర్తకి పుట్టిన కొడుకు కార్తికేయ. అయితే ఆ ఇంటర్వ్యూలో తనకి ఎనిమిదేళ్ళ వయస్సు ఉన్నప్పుడే రాజమౌళి మా ఇంటికి వస్తూ ఉండేవారు. అప్పుడే నాకు ఆయన తండ్రి అయితే బావుంటుంది అనిపించింది. ఒకవేళ ఆయన రాకపోయినా.. అయన వస్తే బావుండేది అనిపించేది. సీరియల్స్ షూటింగ్స్ లో బిజీగా ఉండి రాలేకపోయేవారు.
అమ్మని రాజమౌళిగారు పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఆనందం వేసింది. నేను కోరుకున్నది అదే కదా అనిపించింది. అయితే తనని నాన్న అని పిలవడం కంటే బాబా అని పిలవడం మొదటినుండి అలవాటుగా మారిపోయింది. ఇప్పటికి అలాగే పిలుస్తాను. ఆ పిలుపులో మా ఇద్దరి మధ్య అనుబంధం కనిపిస్తుంది అంటూ కార్తికేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.
ఇక ఆస్కార్ కి ఆర్.ఆర్.ఆర్ సినిమా నామినేట్ అవ్వుద్ది అనుకుంటే నాటు నాటు సాంగ్ నామినేట్ అయ్యింది. దానికోసం ఏకంగా 16 కోట్ల బడ్జెట్ ఖర్చుపెట్టాలని కోడ్ చేసారు. మేము దానిని సగానికి తీసుకొచ్చి 8.5 కోట్లతో ప్రమోట్ చేసాము. అసలు 80 కోట్లు అయ్యింది అంటూ ప్రచారం జరగడం షాకిచ్చింది. కానీ దానికి అక్షరాలా 8.5 కోట్లు కాగా.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ఆస్కార్ ఫంక్షన్ కి వచ్చిన టీమ్ మొత్తం ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకున్నారు. జర్నీ, అక్కడ ఉన్నప్పుడు ఖర్చు ఇలా అందరూ సపోర్ట్ చేసారు కాబట్టే ఇంత ఘనత సాధించామంటూ కార్తికేయ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.