Advertisementt

ముగ్గురికీ మూడు ప్లాప్స్-ఖుషి పరిస్థితి ఏమిటో?

Tue 18th Apr 2023 07:53 PM
samantha,vijay devarakonda,kushi update  ముగ్గురికీ మూడు ప్లాప్స్-ఖుషి పరిస్థితి ఏమిటో?
Three plops-what is Khushi condition? ముగ్గురికీ మూడు ప్లాప్స్-ఖుషి పరిస్థితి ఏమిటో?
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ-సమంత ఇద్దరూ మహానటి తర్వాత పూర్తి స్థాయి ప్రేమ కథ చిత్రం ఖుషి చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-సమంతలు కలిసి ప్రేమికుల్లా కనిపించబోతున్నారు. సమంత హెల్త్ రీజన్స్ వలన ఖుషి చిత్రం షూటింగ్ అలాగే రిలీజ్ డేట్ లేట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం కేరళ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఖుషి చిత్రంపై సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ న్యూస్ లతో అటు విజయ్ దేవరకొండ, ఇటు సమంత అభిమానులు ఆందోళన పడుతున్నారు.

ఎందుకంటే విజయ్ దేవరకొండ లైగర్ పాన్ ఇండియా ఫిల్మ్ తో బిగ్గెస్ట్ డిసాస్టర్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ తో కలిసి చేసిన లైగర్ పాన్ ఇండియా మార్కెట్ లో బోల్తా కొట్టింది. ఇక రీసెంట్ గా శాకుంతలంతో సమంత పాన్ ఇండియా డిసాస్టర్ అందుకుంది. శివ నిర్వాణ లాస్ట్ ఫిల్మ్ టక్ జగదీశ్ ప్లాప్ అయ్యింది. దానితో ఈ ముగ్గురి కాంబోపై ట్రేడ్ లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి.

డిసాస్టర్ కాంబోలో తెరకెక్కుతున్న ఖుషి పై ఎలాంటి అంచనాలు ఉంటాయి.. ఈ సినిమా బిజినెస్ ఎలా ఉండబోతుంది, ఈ చిత్రానికి ఎంత హైప్ క్రియేట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే.. నెటిజెన్స్ కూడా ఆలోచనలో పడిపోతున్నారు.

Three plops-what is Khushi condition?:

Samantha-Vijay Devarakonda Kushi Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ