పవన్ కళ్యాణ్ ఫాన్స్ భయపడిందే జరిగింది. ప్రియాంక అరుళ్ మోహన్ ని OG హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ మేకర్స్ OG సెట్స్ లోకి వెల్ కమ్ చెబుతూ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో పవన్ ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ప్రియాంక మోహన్ పవన్ కళ్యణ్ పక్కన ఏం ఆనుతుంది అనేది వారిలో భయం మొదలవటానికి అసలు కారణం. మరోపక్క ఆమెకి అంత క్రేజ్ కూడా లేదు. వరుణ్ డాక్టర్, శ్రీకారం, గ్యాంగ్ లీడర్ సినిమాలతో కొద్దిగా ఫెమస్ అయిన ప్రియాంక క్రేజ్ పవన్ సినిమాకి సరిపోతుందా అనేది వారి అభిప్రాయం
కానీ సుజిత్ అండ్ కో ప్రియాంకనే హీరోయిన్ గా ఫైనల్ చేస్తూ ఆమెకి వెల్ కమ్ చెప్పేసారు. ఇప్పుడిక పవన్ ఫాన్స్ ఏం చెయ్యగలరు. ఈ నెల 15 నుండి ముంబైలో మొదలైన OG షూటింగ్ లో నిన్న ఏప్రిల్ 18 న పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ లుక్ లో సెట్ లోకి ఎంటర్ అయిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ రోజు ప్రియాంక అరుళ్ మోహన్ సెట్స్ లోకి రావడంతో మేకర్స్ అఫీషియల్ గా హీరోయిన్ ని రివీల్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు.
దానితో పవన్ ఫాన్స్ లో టెన్షన్ ఎక్కువైంది. ఈమె కాకుండా మరో హీరోయిన్ దొరకలేదా అంటూ వారు సుజిత్ ని డైరెక్ట్ గానే ఫైర్ అవుతున్నారు. ఇక OG మొదలైందో లేదో అప్ డేట్స్ మీద అప్ డేట్స్ ఇస్తూ మేకర్స్ పవన్ ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు.