Advertisementt

సుకుమార్ ఇల్లు, ఆఫీసుపై ఐటి దాడులు

Wed 19th Apr 2023 12:51 PM
sukumar,mythri movies  సుకుమార్ ఇల్లు, ఆఫీసుపై ఐటి దాడులు
IT raids on Sukumar house and office సుకుమార్ ఇల్లు, ఆఫీసుపై ఐటి దాడులు
Advertisement
Ads by CJ

పుష్ప తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన సుకుమార్.. అంతకుముందే రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. పుష్ప పార్ట్ 2 షూటింగ్స్ తో బిజీగా వున్న సుకుమార్ ఇల్లు, ఆయన ఆఫీస్ పై ఐటి దాడులు జరగడం టాలీవుడ్ లో కలకలం సృష్టించాయి. కేవలం సుకుమార్ ఇంటిపైనే కాకుండా మైత్రి మూవీస్ ఆఫీస్ లపై.. టాలీవుడ్ లోని కొంతమంది ప్రముఖులు జీఎస్టీ చెల్లించని కారణంగానే ఈరోజు బుధవారం ఐటి అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది.  

ప్రస్తుతం సుకుమార్ ఇల్లు, ఆయన ఆఫీస్ ల్లో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారని, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ లలో ఈ ఐటి దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు డిసెంబర్ లో మైత్రి మూవీ మేకర్స్ పై కూడా ఇలానే ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. వాల్తేర్ వీరయ్య, వీర సింహ రెడ్డి సినిమాల విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓపెనింగ్  రోజునే మైత్రి మూవీ మేకర్స్ పై ఐటి దాడులు జరిగాయి.

ప్రస్తుతం సుకుమార్ కూడా మైత్రిలోనే పుష్ప 2 మూవీ తెరకెక్కిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి జీఎస్టీ సరిగ్గా చెల్లించని కారణంగానే ఈ ఐటి దాడులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది.

IT raids on Sukumar house and office:

IT raids on offices of Sukumar and Mythri movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ