Advertisementt

క్యూట్ లుక్ లో KGF పాప

Wed 19th Apr 2023 07:43 PM
kgf,srinidhi shetty  క్యూట్ లుక్ లో KGF పాప
Srinidhi Shetty in cute look క్యూట్ లుక్ లో KGF పాప
Advertisement
Ads by CJ

KGF రెండు పార్టుల్లో హీరో యశ్ తో జోడి కట్టిన శ్రీనిధి.. క్యూట్ లుక్స్ తో ప్రేక్షకుల మనసులు దోచేసింది. శ్రీనిధి శెట్టి KGF ద్వారా ఫ్యాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. KGF తర్వాత శ్రీనిధి శెట్టి ఎన్నో హోప్స్ పెట్టుకున్న చియాన్ విక్రమ్ తో నటించిన కోబ్రా మూవీ ప్లాప్ అవడంతో.. ప్రస్తుతం ఆమె పేరు పెద్దగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. అయితే KGF ఫ్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత శ్రీనిధి శెట్టి పారితోషకం పంచేసింది అనే న్యూస్ హాట్ హాట్ గా చక్కర్లు కొట్టింది. ఆమె KGF సక్సెస్ చూసుకుని పారితోషకం డబుల్ చేసింది అన్నారు.

సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా కనబడని శ్రీనిధి శెట్టి ఈమధ్యన ఫోటో షూట్స్ తో కాస్త యాక్టీవ్ గా మారింది. ట్రెడిషన్ డ్రెస్సులతో క్యూట్ లుక్స్ తో ఇంప్రెస్స్ చేస్తుంది. A little talk 👀💌 అంటూ కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. ఆ పిక్స్ లో గ్లామర్ షో లేకపోయినా క్యూట్ అండ్ స్వీట్ గా శ్రీనిధి అందంగా కనిపించింది. 2015 లో మిస్ కర్ణాటకగా మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పాప KGF తోనే బాగా పాపులర్ అయ్యింది.

KGF, కోబ్రాల ఆతర్వాత శ్రీనిధి పేరు మరే ఇతర హీరో పక్కన వినిపించకపోవడం గమనార్హం. ఆమెకి KGF తర్వాత ఏ భాష నుండైనా అవకాశాలు వెల్లువలా వస్తాయనుకున్నారు కానీ.. ఇంతవరకు ఏ స్టార్ హీరో ఆమెవైపు చూసిందే లేదు. జస్ట్ ఇలా ఫొటోస్ షూట్స్ తో కాలక్షేపం చేసింది అంతే.

Srinidhi Shetty in cute look:

KGF fame Srinidhi Shetty in cute look

Tags:   KGF, SRINIDHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ