కొద్దిరోజులుగా యాంకర్ శ్రీముఖిలో చాలా మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు బబ్లీగానే యాంకరింగ్ చేసి పేరు తెచ్చుకున్న శ్రీముఖి ఈమధ్యన గ్లామర్ డోస్ పెంచేసింది. అందాలు ఆరబొయ్యడమే టార్గెట్ గా పెట్టుకుని బుల్లితెర మీద సందడి చేస్తుంది. ఓటిటి దగ్గర నుండి బుల్లితెరపై అన్ని ఛానల్స్ లో శ్రీముఖి హడావిడే. బుల్లి బుల్లి గౌనులతో, బుల్లి బుల్లి స్కర్ట్స్ తో మెంటలెక్కిస్తున్న శ్రీముఖి ఫైనల్ టార్గెట్ వెండితెర.
కానీ ఆమెకి అక్కడ పెద్దగా అవకాశాలు రావడం లేదు. అప్పుడప్పుడు కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించే ఆమె క్రేజీ అంకుల్స్ అంటూ చేసిన సినిమా ప్లాప్ అయ్యింది. ఆతర్వాత శ్రీముఖి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. అయితే తాజాగా శ్రీముఖి కోరిక నెరవేరినట్లే కనిపిస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి ఓ కీలక పాత్ర చేస్తుంది. అంతేకాకుండా మరో సీనియర్ హీరో బాలకృష్ణ-అనిల్ రావిపూడి మూవీలోనూ ఓ పాత్ర చేస్తున్న శ్రీముఖి ఈ రెండు సినిమాలపై హోప్స్ పెట్టుకుంది. ఇవి గనక క్లిక్ అయితే తనకు మంచి పేరొస్తుంది అని.. శ్రీముఖి బలంగా నమ్ముతుంది.
మరోపక్క నాగార్జున తదుపరి చిత్రంలోనూ శ్రీముఖి కి ఓ కేరెక్టర్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లోనూ శ్రీముఖి కి మంచి కేరెక్టర్స్ వస్తున్నాయనే టాక్ చూస్తే నిజంగానే శ్రీముఖి కోరిక ఫైనల్లీ తీరినట్టే కనిపిస్తుంది.