Advertisementt

అలీ vs వెన్నెల కిషోర్

Thu 20th Apr 2023 09:31 PM
alitho saradaga,vennela kishore,ala modalindi  అలీ vs వెన్నెల కిషోర్
Ali vs Vennela Kishore అలీ vs వెన్నెల కిషోర్
Advertisement
Ads by CJ

టాప్ కమెడియన్ అలీ ప్రముఖ ఛానల్ ఈటీవీలో ప్రతి మంగళవారం అలీతో సరదాగా షో తో ఎంటర్టైన్ చేసేవారు. ఆయన సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేసినట్టుగా చేస్తూ ఫన్నీగా ఆటలాడించేవారు. ఆలీతో సరదాగా షో కి టాప్ సెలబ్రిటీస్ హాజరయ్యేవారు. ఈ షో చాలా పాపులర్ షో గా నిలిచింది. చాలా సీజన్స్ సక్సెస్ ఫుల్ గానే నడిచాయి. అయితే రీసెంట్ గా అలీ షో ఆగిపోయింది. మంగళవారం రాత్రి వచ్చే అలీతో జాలిగా షో ఆపేసి మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రోగ్రాం ప్లాన్ చేసింది ఈటివి.

అలీతో సరదాగా షో కి మంచి టీఆర్పీనే వచ్చేది. చాలామంది ఈ షో ద్వారా పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను పంచుకునేవారు. ఇప్పుడు అదే స్థానంలో మరో కమెడియన్ వెన్నెల కిషోర్ తో అలా మొదలయ్యింది టాక్ షో ప్లాన్ చేసింది ఈటివి. వెన్నెల కిషోర్ షో కి పెళ్ళైన సెలెబ్రిటీ జంటలు హాజరవుతున్నారు. మొదటి ఎపిసోడ్ నే నిఖిల్ ఆయన భార్యతో రఫ్ఫాడించారు. అంతకుముందు నిఖిల్ ఆయన భార్య విడాకులు తీసుకుంటున్నారనే న్యూస్ ఉన్న సమయంలో వారు కలిసి వెన్నెల అలా మొదలైంది షోకి రావడంతో ఆ ఎపిసోడ్ బాగా వైరల్ అయ్యింది.

ఇక తర్వాత రాజశేఖర్-జీవిత వచ్చారు. వాళ్లు తమ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ఆ షోలో చెప్పారు. ఆ తర్వాత వంశి పైడిపల్లి ఆయన భార్య వచ్చారు. గత వారం మంచు మనోజ్ ఆయన భార్య మౌనికలు గెస్ట్ లుగా రాగా.. ఆ ఎపిసోడ్ కి బాగానే టీఆర్పీ వచ్చి ఉంటుంది. కారణం మనోజ్ ప్రేమ పెళ్లి వ్యవహారమే. ఇక రాబోయే వారం ఆది సాయి కుమార్ ఆయన భార్య వచ్చిన ప్రోమో వైరల్ గా మారింది. 

అయితే అలీతో సరదాగా షో ఎంతగా పాపులర్ అయ్యింది.. కొద్ది ఎపిసోడ్స్ కే వెన్నెల కిషోర్ అలా మొదలైంది షో కూడా బాగా హైలెట్ అయ్యింది. అంటే వెన్నెల కిషోర్ తన వాక్చాతుర్యంతో అలీ షోని ఆల్మోస్ట్ మరిపిస్తున్నట్టే అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు.

Ali vs Vennela Kishore:

Alitho saradaga show vs Vennela Kishore Ala Modalindi show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ