సాయి ధరమ్ తేజ్ హీరోగా.. కార్తీక్ దండు దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓవర్సీస్ షోస్ కంప్లీట్ అవడంతో ఆడియన్స్ పబ్లిక్ టాక్ తో హడావిడి మొదలు పెట్టేసారు. సాయి ధరమ్ తేజ్ ఇలా చేసాడు, విరూపాక్ష మూవీ అలా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఒకటే హడావిడి. ప్రతి ఒక్కరి నోటా సాయి తేజ్ విరూపాక్ష లో విషయం ఉందంటూ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ సో సో గా ఉన్నా సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లు థ్రిల్ చేస్తున్నాయి.
విరూపాక్షగా రెగ్యులర్ కమర్షియల్ హీరోయిజం పక్కన పెట్టి ప్రయోగాత్మక పాత్ర చేశాడు సాయి తేజ్. హ్యాట్రిక్ హీరోయిన్ సంయుక్త చాలా బలమైన, బరువైన పాత్రలో అదరగొట్టింది. సినిమాకి ఆమె క్యారెక్టైజేషన్ మెయిన్ హైలైట్. సినిమాటోగ్రఫీ, BGM, విజువల్ ఎఫెక్ట్స్ విరూపాక్ష కి ఎస్సెట్స్. కొత్త దర్శకుడైనా సుకుమార్ స్క్రిప్ట్ ని పెర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశాడు.. అంటూ పలువురు ఆడియన్స్ విరూపాక్షపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. హార్ట్ పేషెంట్లు ఎవరైనా ఉంటే ఈ సినిమాకు వెళ్లకండి. ఒక చంద్రముఖి.. ఒక అరుంధతి.. ఒక కాంచన.. ఒక విరూపాక్ష అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.
మొదటి పది నిమిషాల లవ్ ట్రాక్ తప్ప మిగిలిదంతా హర్రర్‌గానే ఉంది. ఈ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి. బోరింగ్ లవ్ ట్రాక్ ఉన్నప్పటికీ.. కథాంశం అంతా ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని చిల్లింగ్ మూమెంట్లతో ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా బాగా పుంజుకుంది. సెకెండాఫ్‌పై ఆసక్తిని పెంచింది. స్క్రీన్‌ప్లే చాలా వరకూ ఎంగేజింగ్‌గా ఉండడంతో వర్కౌట్ అయింది అంటూ పబ్లిక్ నుండి విరూపాక్ష మూవీ కి అందుతున్న టాక్.
మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ట్విస్ట్ తో ఎండ్ అయ్యే విరూపాక్ష కి సీక్వెల్ ఉంటుందంటూ మేకర్స్ కన్ఫర్మ్ కూడా చేశారు.!