సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ మధ్యన హాట్ షో ఎక్కువ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న మృణాల్ ఠాకూర్ ఫాన్స్ తో చిట్ చాట్, వెకేషన్స్ లో ఎంజాయ్మెంట్ అంటూ నానా హంగామా చేస్తుంది. సీతారామంలో సీత పాత్రలో అద్భుతంగా అందరి మనసులని దోచేసిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత గ్లామర్ అవతారమెత్తింది. అయితే మృణాల్ ఠాకూర్ గ్లామర్ షోకి, బికినీ షోకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
బాలీవుడ్ రోల్స్ తో గ్లామర్ గా హైలెట్ అవడమే కాదు.. సోషల్ మీడియాలోనూ అందాల జాతర మొదలు పెట్టింది. ఈమధ్యనే #Nani30 షూట్ లో జాయిన్ అయిన మృణాల్ ఠాకూర్ తాజాగా పెళ్లి కూతురు గెటప్ లో అదరగొట్టేసింది. బాలీవుడ్ లో ప్రముఖ డిజైనర్లు శ్యామల అండ్ భూమిక వారు రెడీ చేసిన హ్యాండీక్రాఫ్ట్డ్ లెహంగాలో అచ్చం పెళ్లి కూతురిలా ముస్తాబైంది. ఆ డిజైనర్ డ్రెస్ లో సిగ్గుపడుతూ మృణాల్ ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నుదిటిన పాపిడిబిళ్ళ, చేతులకి మెహిందీ, మెడలో నెక్ లెస్ తో మృణాల్ అచ్చం పెళ్లికూతురు అవతారంలో నవ్వుతూ కనిపించింది. అయితే మృణాల్ కి ఇలాంటి ట్రెడిషనల్ గెటప్స్ బాగా నప్పుతాయని నెటిజెన్స్ లేటెస్ట్ గా కామెంట్ చేస్తున్నారు. గ్లామర్ గా కన్నా మృణాల్ ఇలానే బావుంటుంది అంటున్నారు.