Advertisementt

పుష్ప 2: ఛాలెంజింగ్ పాత్రలో జగ్గు భాయ్

Fri 21st Apr 2023 12:30 PM
jagapathi babu,pushpa 2  పుష్ప 2: ఛాలెంజింగ్ పాత్రలో జగ్గు భాయ్
Pushpa 2: Jaggu Bhai in a challenging role పుష్ప 2: ఛాలెంజింగ్ పాత్రలో జగ్గు భాయ్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఒరిస్సా-ఆంధ్ర సరిహద్దుల్లోని ఫారెస్ట్ లో పుష్ప ద రూల్ షూటింగ్ చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1 హిట్ అవడంతో పార్ట్ 2 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. పుష్ప పార్ట్ 1 లోనే చాలామంది విలన్స్ ని చూపించిన సుకుమార్ మెయిన్ విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు పుష్ప పార్ట్2 లోను ఇంకొంతమంది పేరున్న నటుల్ని విలన్స్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. అందులో విజయ్ సేతుపతి ఒకరు అంటూ ప్రచారం జరిగింది. అలాగే జగపతి బాబు పేరు గట్టిగానే వినిపించింది 

రంగస్థలంలో జగపతి బాబుని చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసిన సుకుమార్ మరోసారి పుష్ప 2 లో కీలక పాత్ర ఇస్తున్నారని అన్నప్పటికీ ఎక్కడా ఈ న్యూస్ పై క్లారిటీ లేదు. తాజాగా జగపతి బాబు హిందీ ఫిలిం కిసి కా భాయ్ కిసి కా జాన్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ తాను పుష్ప 2 లో నటిస్తున్నట్లుగా కన్ ఫర్మ్ చేసారు. సుకుమార్ తో వర్క్ చెయ్యడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటూ జగపతి బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పుష్ప 2లో తాను ఛాలెంజింగ్ పాత్రలో కనిపిస్తున్నాను, నాకు అలాంటి కేరెక్టర్స్ చెయ్యడం అంటేనే ఇష్టం, సుకుమార్ తో కలిసి వర్క్ చేసేందుకు ఎప్పుడూ రెడీగానే ఉంటాను అంటూ పుష్ప 2 లో తాను ఎలాంటి కేరెక్టర్ లో కనిపించబోతున్నారో చెప్పి హైప్ క్రియేట్ చేసారు. ఇక అల్లు అర్జున్ గురించి కూడా జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

అల్లు అర్జున్ ని ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ జిమ్ లో చూసాను. అప్పుడు అతనెవరో నాకు తెలియదు. కానీ అల్లు అర్జున్ హార్డ్ వర్క్ చెయ్యడం గమనించాను. అందుకే అతను ఇప్పుడు ఈస్థాయిలో ఉన్నాడు.. అతన్ని చూస్తే గర్వంగా అనిపిస్తుంది అంటూ జగపతి బాబు పుష్ప 2, అల్లు అర్జున్, సుకుమార్ గురించి మట్లాడారు.

Pushpa 2: Jaggu Bhai in a challenging role:

Jagapathi Babu Key Role In Pushpa 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ