Advertisementt

టాలీవుడ్ కి గోల్డెన్ లెగ్ గా మారింది

Fri 21st Apr 2023 09:52 PM
samyuktha menon  టాలీవుడ్ కి గోల్డెన్ లెగ్ గా మారింది
Successful Heroine Turns Golden Leg in Tollywood టాలీవుడ్ కి గోల్డెన్ లెగ్ గా మారింది
Advertisement
Ads by CJ

అందం, గ్లామర్, పెరఫార్మెన్స్ ఉంటేనే హీరోయిన్స్ కొద్దికాలం ఇండస్ట్రీలో నిలబడతారు. నటన అంతగా రాకపోయినా కేవలం గ్లామర్ రోల్స్ తో నెట్టుకొచ్చే హీరోయిన్స్ చాలామంది స్టార్ హీరోలతో జోడి కడుతూ టాప్ చైర్ కి చేరుకునే వారూ ఉన్నారు. పెరఫార్మెన్స్ తోనే హైలెట్ అవ్వాలనుకునే హీరోయిన్స్ చాలా త్వరగా ఫెడవుట్ అయ్యిపోతున్నారు. నిత్యా మీనన్, నివేత థామస్ లాంటి హీరోయిన్స్ టాలెంటెడ్ నటీమణులు. వారు అందాలు చూపించరు.. అయినా అడపాదడపా మంచి పాత్రల్లో కనిపిస్తారు. 

తాజాగా మరో హీరోయిన్ అందాలు ఆరబొయ్యకుండానే పెరఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలతో టాలీవుడ్ కి గోల్డెన్ లెగ్ లా మరింది. ఆమె సంయుక్త మీనన్. స్కిన్ షో చెయ్యదు, అందాలు ఆరబొయ్యదు. కానీ వరస ఆఫర్స్. అవి కూడా వరస హిట్స్ అవడం ఆమెని ఇప్పుడు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది. భీమ్లా నాయక్ లో రానాకి వైఫ్ గా నేచురల్ లుక్స్ లో కనిపించింది. ఆ సినిమా సూపర్ హిట్. తర్వాత బింబిసార లో పోలీస్ పాత్రలో మోడరన్ గా కనిపించినా స్కిన్ షో చెయ్యలేదు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

ఇక ధనుష్ తో సార్ మూవీలో సారీలో సింపుల్ గా కనిపించింది. సార్ మూవీ కూడా హిట్ అవడంతో హ్యాట్రిక్ హిట్స్ తో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇక ఇప్పుడు విరూపాక్ష హిట్ తో గోల్డెన్ లెగ్ గా టర్న్ తీసుకుంది. విరూపాక్ష ప్రమోషన్స్ లోనూ ఎక్కడా అందాలు ఆరబొయ్యలేదు, జస్ట్ సారీస్ తోనే మెస్మరైజ్ చేస్తూ బ్యూటిఫుల్ గా కనిపించింది. విరూపాక్ష చిత్రంలో డిఫరెంట్ గా ఆకట్టుకుంది. ఆ సినిమాకి హిట్ రివ్యూస్, పబ్లిక్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో సినిమా కూడా హిట్ లిస్ట్ లో చేరిపోయింది.

దానితో ఇప్పడు అందరూ సంయుక్త మీనన్ గురించే చర్చించుకుంటున్నారు. గ్లామర్ షో లేకుండా వరసగా నాలుగు పెద్ద సినిమాల ఆఫర్స్. అవి కూడా వరస హిట్స్. దానితో ఇప్పుడు ఈమె పేరు టాలీవుడ్ లో మోగిపోతుంది. ఇకపై సీనియర్ హీరోలు సంయుక్త మీనన్ కి ఆఫర్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

Successful Heroine Turns Golden Leg in Tollywood:

Samyuktha Menon Turns Golden Leg in Tollywood

Tags:   SAMYUKTHA MENON
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ