పూజ హెగ్డే కి టైం అస్సలు కలిసి రావడం లేదు. ఆమె నటించిన సినిమాలు వరసగా ప్లాప్ అవడంతో పూజ హెగ్డే క్రేజ్ కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. స్టార్ హీరోలతో స్టార్స్ ఛాన్సెస్ తో భారీ బడ్జెట్ మూవీస్ లో నటిస్తూ గ్లామర్ షో చేస్తూ హడావిడి చేసే పూజా హెగ్డే కి గత ఏడాది బిగ్ షాక్ అనే చెప్పాలి. 2022 లో పూజా హెగ్డే కి అస్సలు కలిసి రాలేదు. వరసగా నాలుగు సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్.
రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కార్ నాలుగు సినిమాలు ఆమెకి బిగ్ షాకిచ్చాయి. ఆమె కెరీర్ లోనే ఎప్పటికి మర్చిపోలేని చిత్రాలుగా మిగిలిపోయాయి అవి. ఇప్పుడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో నటించిన కిసి కా భాయ్ కిసి కా జాన్ కూడా పూజ హెగ్డే కి షాకిచ్చింది. ఈ చిత్రం మొదటి రోజే పూర్ ఓపెనింగ్స్ తెచ్చుకోగా.. టాక్ కూడా ఏమాత్రం బాగాలేదు. సల్మాన్ ఖాన్-వెంకటేష్ లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ.. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి ఆదరణ కనిపించడం లేదు.
పూజ హెగ్డే అందంగా, గ్లామర్ గానే కనిపించినా సల్మాన్ ఖాన్ తో కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఈ చిత్రం తమిళ వీరం కి రీమేక్. సల్మాన్ ఖాన్, యాక్షన్ సీన్స్ తప్ప చెప్పుకోవడానికి ఆ చిత్రం లో ఏమిలేవని తేల్చేసారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పూజ హెగ్డే గ్లామర్ గా సందడి చేసింది. సల్మాన్ ఖాన్ తో కలిసి హడావిడి చేసింది. ప్రస్తుతం సౌత్ లో పూజా హెగ్డే కి మహేష్ SSMB28 తప్ప మరో మూవీ కూడా లేదు.
హ్రితిక్ రోషన్ తో చేసిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ మోహింజదారో అట్టర్ ప్లాప్ అవ్వగా, గత ఏడాది సర్కస్ డిసాస్టర్ అయ్యింది. ఇప్పుడు కిసి కా భాయ్ కిసి కా జాన్ ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. దాటి పూజ కి బాలీవుడ్ అస్సలు కలిసి రావడలేదనే కామెంట్స్ మొదలయ్యాయి.
ఇదంతా చూస్తుంటే అయ్యో పాపం పూజ హెగ్డే అనాలనిపిస్తుంది. ఇక పూజ హెగ్డే కి హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ పై గాలి మళ్లింది. సమంత, నయనతారలా ఆమెకి మహిళలపై సినిమాలు చెయ్యాలనే కోరిక ఉంది అంటూ ఈమధ్యనే బయటపెట్టింది.