Advertisementt

హీరోయిన్ కి అఖిల్ వేధింపులు? అసలు క్లారిటీ!

Sun 23rd Apr 2023 08:22 PM
urvashi,akhil akkineni  హీరోయిన్ కి అఖిల్ వేధింపులు? అసలు క్లారిటీ!
Akhil harassed Urvashi Rautela హీరోయిన్ కి అఖిల్ వేధింపులు? అసలు క్లారిటీ!
Advertisement
Ads by CJ

ఏజెంట్ మూవీ ప్రమోషన్స్ లో గత వారం రోజులుగా అక్కినేని అఖిల్ ఆయన హీరోయిన్ సాక్షి చాలా బిజీగా గడుపుతున్నారు. సురేందర్ రెడ్డి ఫైనల్ అవుట్ ఫుట్ రెడీ చేస్తుంటే అఖిల్ సింగిల్ హ్యాండ్ తో ఏజెంట్ ప్రమోషన్స్ తో హడావిడి చేస్తున్నాడు. ఈరోజు ఆదివారం నాగార్జున స్పెషల్ గెస్ట్ గా ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో జరుగుతుంది. మరో ఈవెంట్ హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ అతిధిగా రాబోతున్నాడనే టాక్ ఉంది.

అయితే ఏజెంట్ సెట్స్ లో స్పెషల్ సాంగ్ చేసిన ఊర్వశి రౌతెల్లని అఖిల్ వేధించాడంటూ దుబాయ్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సందు ట్వీట్ చెయ్యడం వైరల్ గా మరింది. అఖిల్ తో పని చెయ్యడం కష్టమంటూ ఊర్వశి చెప్పింది అని ఉమైర్ ట్వీట్ చేసాడు,. గతంలోనూ నాగ చైతన్య సమంతని వేధించాడు అందుకే ఆమె విడాకులిచ్చింది, శ్రీనిధి శెట్టిని KGF యశ్ సెట్స్ లో వేధించాడంటూ.. ఇలా సెలబ్రిటీస్ పై ట్వీట్స్ చేస్తూ రకరకాల ట్వీట్స్ తో ఇబ్బంది పెడుతున్న ఉమర్ సందుపై ఊర్వశి ఫైర్ అయ్యింది. 

ఇలాంటి పనికిరాని ట్వీట్స్ చేస్తున్న అతనిపై మా లీగల్ టీమ్ ఇప్పటికే పరువు నష్టం దావా వేసింది. ఇలాంటి వారి వల్ల నేను, మా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతున్నాము, అసలు అఖిల్ వల్ల తనకి ఎలాంటి సమస్య లేదని, ఏజెంట్ స్పెషల్ సాంగ్ షూటింగ్ అంతా కూల్ గా జరిగింది అంటూ ఊర్వశి క్లారిటీ ఇచ్చింది.

Akhil harassed Urvashi Rautela:

Urvashi shares fake post claiming Akhil Akkineni harassed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ