జబర్దస్త్ టాప్ కమెడియన్, బిగ్ బాస్ ఫేమ్ చలాకి చంటి గుండెపోటుతో ఉన్నట్టుండి హైదరాబాద్ ప్రవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడనే న్యూస్ కామెడీ ప్రియులకి, ఆయన అభిమానులకి షాక్ ఇచ్చింది. చంటి ప్రాణాపాయ స్థితిలో ICU లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంతుందో తెలియక కన్ఫ్యూజ్ అయిన వారు కూడా ఉన్నారు.
అయితే చలాకి చంటి కి నిజంగానే గుండెపోటు రాగా ఆయన్ని కుటుంభ సభ్యులు ఆసుపత్రిలో జాయిన్ చేసారని, ఆయన్ని ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పటికీ చంటి ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే సీరియస్ కండిషన్ లోనే ఆసుపత్రిలో జాయిన్ అయిన చంటి ప్రస్తుతం కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ప్రాణాపాయ స్థితి నుండి బయటపడినట్లుగా.. సోమవారం లేదా మంగళవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది.