తెలంగాణాలో పార్టీ పెట్టి ఇక్కడ పాద యాత్ర అంటూ హడావిడి చేస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ నిరుద్యోగ సమస్యలపై పోరాటమంటూ తన ఉనికిని చాటుకుంటున్న వైఎస్ షర్మిల పోలీసులని ఎడా పెడా కొట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. షర్మిలని ఈ రోజు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన ఇంటి నుండి బయటికి రాకూండా పోలీసు లు అడ్డుకున్నారు. ఆమె కారులో బయటికి వెళుతున్న సమయంలో పోలీసు లు అడ్డుకుని కారు దించేసి ఆమెని ఇంటిలోపలికి వెళ్ళమని చెప్పినా వినకుండా షర్మిల మొండిగా ప్రవర్తిస్తూ తనకి అడ్డువచ్చిన ఎస్సై ని, మహిళా కానిస్టేబుల్ చెంప మీద కొట్టిన వీడియోస్ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
పోలీసులతో వాగ్వాదానికి దిగిన షర్మిల పోలీసులను నెట్టేస్తూ మహిళా పోలీసు చెంప మీదకొట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ కి దిగడంతో ఆమెని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే కుమార్తె షర్మిలని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చెయ్యడంతో వైఎస్ విజయమ్మ కూతురిని చూడడానికి జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ కి వచ్చినప్పుడు పోలీసులు విజయమ్మని అడ్డుకోవడంతో కోపం వచ్చిన విజయమ్మ అక్కడ ఉన్న పోలీసులని నెట్టేస్తూ మరో పోలీసుపై చెయ్యి చేసుకోవడం మీడియాలో హైలెట్ అయ్యింది.
అమ్మ విజయమ్మ, కూతురు షర్మిల ఇలా పోలీసులపై చెయ్యి చేసుకోవడంపై మీడియాలో రకరాల న్యూస్ లు వస్తున్నాయి. కానీ విజయమ్మ మాత్రం నేను కొట్టాలనుకుంటే గట్టిగా కొట్టగలను.. మెల్లిగా అలా చెయ్యి ఎత్తాను అంతే.. మీడియాలో నేను చాలా గట్టిగా కొట్టినట్లు చూపిస్తున్నారు అంటూ చెబుతున్నారు.