ఆడవాళ్ళకి సారీస్ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. ఎక్కడ చీరలు తక్కువ ధరకు వస్తున్నాయన్నా అక్కడ వాలిపోతారు. డిస్కౌంట్ సేల్ అంటే చెప్పక్కర్లేదు. తండోపతండాలుగా తరలి వెళతారు. ఇప్పటికీ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ చీరల డిస్కౌంట్ సెల్ అప్పుడు షాప్స్ దగ్గర రద్దీ ఎలా ఉంటుందో చూస్తూనే ఉంటాము. అయితే తాజాగా ఓ షోరూం లో ఈ డిస్కౌంట్ సేల్ నడుస్తున్న సమయంలో ఇద్దరు మహిళలు ఓ చీర కోసం కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బెంగుళూరు లోని మైసూర్ సిల్క్స్ లో డిస్కౌంట్ సేల్ పెట్టారు షాప్ యజమానులు, ఏడాదికి ఒక్కసారి క్లీయరెన్స్ సేల్ అంటూ డిస్కౌంట్ సేల్ చూసేసరికి మహిళలు ఎగబడ్డారు. ఒక్కొక్కరు పదేసి చీరలు ఏరుకుంటున్న సందర్భంలో ఇద్దరు మహిళలు ఒకే చీర కోసం కొట్టుకుంటూ జుట్లు జుట్లు పట్టుకోవడం ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. ఆ వీడియోలో కొంతమంది మహిళలు ఆ గొడవని చూసి ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు మనకెందుకు ఆ గొడవ.. చీరలు సెలెక్ట్ చేసుకుందామన్నట్టుగా కనిపించారు.
ఇక చీర కోసం సిగపట్లు పట్టుకున్న మహిళలని విడదియ్యడానికి అక్కడే ఉన్న సెక్యూరిటీ నానా తంటాలు పడ్డాడు. ఇక ఆ మహిళలేమి చదువుకొని వాళ్ళు కాదు, మంచి డ్రెస్ లతో చదువుకున్న వాళ్ళలానే కనిపించడం గమనార్హం.