శుక్రవారం విడుదలై సక్సెస్ ఫుల్ గా హిట్ టాక్ తో దూసుకుపోతున్న విరూపాక్ష కలెక్షన్స్ మొదటి వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ దగ్గరకి చేరడం నిర్మాతల్లోనే కాదు.. డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా ఆనందాన్నిచ్చింది. అటు సాయి తేజ్ కెరీర్ లోనే విరూపాక్ష బెస్ట్ ఓపెనింగ్స్, బెస్ట్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. అయితే విరూపాక్ష క్లైమాక్స్ లోనే దీనికి సీక్వెల్ ఉండబోతుంది అంటూ దర్శకుడు కార్తీక్ దండు హింట్ ఇచ్చేసాడు.
తాజాగా సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సీక్వెల్ ని కన్ ఫర్మ్ చేసాడు. విరూపాక్ష సక్సెస్ జోష్ లో ఈ రోజు సోమవారం ఆయన ఆస్క్SDT అంటూ అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఓ అభిమాని విరూపాక్ష సీక్వెల్ ఉంటుందా అన్నా అని అడిగాడు. దానికి సాయి తేజ్ విరూపాక్ష పార్ట్ 2 ఉంది కాబట్టే హింట్ ఇచ్చాం అని సమాధానమిచ్చాడు.
ఏ హీరోయిన్ అంటే క్రష్ అని అడగ్గానే టక్కున సమంత అని చెప్పాడు. ఇక సాయి తేజ్ కి జరిగిన ప్రమాదం తర్వాత వచ్చిన సినిమా అవడంతో విరూపాక్షకి సింపతీ కూడా వర్కౌట్ అవడం ఆ సినిమా కలెక్షన్స్ పెరగడానికి కారణమైతే.. సెలబ్రిటీస్ సపోర్ట్ సాయి తేజ్ సినిమాకి ప్లస్ అయ్యింది.