Advertisementt

క్లైమాక్స్ కోసం గేమ్ ఛేంజర్ టీం అక్కడికి..

Tue 25th Apr 2023 04:32 PM
game changer  క్లైమాక్స్ కోసం గేమ్ ఛేంజర్ టీం అక్కడికి..
Game Changer Climax Fight Sequence update క్లైమాక్స్ కోసం గేమ్ ఛేంజర్ టీం అక్కడికి..
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ మూడు లాంగ్వేజెస్ లో చేస్తున్న గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ మొదలైపోయింది. శంకర్ ఇండియన్ 2 తైవాన్ షెడ్యూల్ ముగించుకుని రామ్ చరణ్ కోసం హైదరాబాద్ కి వచ్చేసారు. రామ్ చరణ్ ఇంకా SJ సూర్య లపై గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ చిత్రీకరణలో బిజీ అయ్యారు. గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ ని హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ దగ్గర భారీ సెట్ వేసి ఈ చిత్రీకరణ చేపట్టారు.

చరణ్-సూర్య మధ్యన పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కో జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా.. చరణ్ బర్త్ డే రోజున వదిలిన టైటిల్ కి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లుక్ కి మెగా ఫాన్స్ బాగా ఇంప్రెస్స్ అయ్యారు. అయితే అదే రోజు ఈ చిత్ర రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారని ఫాన్స్ ఆశ పడినా మేకర్స్ ఎందుకో వెనకడుగు వేశారు. గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ తోనే సినిమా చిత్రీకరణ కంప్లీట్ అవ్వదని.. ఇంకా రెండు నెలలు అంటే 60 రోజుల షూట్ బ్యాలన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

సో షూట్ చివరి దశకి వచ్చాకే శంకర్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తారట. సంక్రాంతికా.. లేదంటే సమ్మర్ లో రిలీజ్ చేస్తారా అనేది ఫైనల్ కావాల్సి ఉంది.

Game Changer Climax Fight Sequence update:

Game Changer shooting update

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ