మెగా డాటర్ నిహారిక కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చిరు కూతుళ్ళ కన్నా నాగబాబు కూతురే మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది. కారణం ఆమె యాక్ట్ చేస్తుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఆమె యాక్టింగ్ విషయమై సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం లేదు. ఆమె తన భర్త చైతన్య జొన్నలగడ్డకి విడాకులు ఇచ్చేసిందేమో అనే అనుమానంలో మీడియా ఉంది.
కారణం నిహరిక, ఆమె భర్త చైతన్యలు తమ పెళ్లి ఫొటోస్ ని డిలేట్ చెయ్యడం, ఒకరిని ఒకరు అన్ ఫాలో చెయ్యడమే. ఒకవేళ ఇది ఏమైనా రూమర్ అయితే గనక నాగబాబు ఎప్పుడో యూట్యూబ్ లో కూర్చుని ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చెయ్యొద్దు అంటూ క్లారిటీ ఇచ్చేవారు. కానీ నిహారిక విడాకుల విషయంలో ఆయన గమ్మునున్నారు. ఇక నిహారిక ఆ విషయం పక్కనబడేసి తాను నటిస్తున్న వెబ్ సీరీస్ విషయంలో సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంది.
తాజాగా నిహారిక గోవా వెళ్ళింది. అక్కడ ఫ్రెండ్ తో కలిసి సమ్మర్ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతుంది. గోవా వెకేషన్ లో తన ఫ్రెండ్ తో కలిసి నిహారిక ఎంజాయ్ చేస్తున్న పిక్స్, వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అవి వైరల్ అవ్వగా.. నిహారిక విడాకుల విషయం నుండి బయటపడేందుకే గోవా వెళ్ళింది అంటున్నారు.