ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతి తెరకెక్కిస్తున్న రాజా డీలక్స్ చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో కాకపోయినా.. షెడ్యూల్ ప్రకారమే ప్రభాస్ ఖాళీగా ఉన్నప్పుడల్లా చిత్రీకరిస్తున్నారు. ఈమధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన పెంట్ హౌస్ సెట్ లో ప్రభాస్-హీరోయిన్ రిద్ది కుమార్ పై కీలక సన్నివేశాలను మారుతీ చిత్రీకరించాడు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కూడా హీరోయిన్స్ గా ప్రభాస్ సరసన జోడి కడుతున్నారు.
ప్రభాస్-మాళవిక మోహనన్ మధ్యలో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, లవ్ ట్రాక్ అంతా రాజా డీలక్స్ కి హైలెట్ గా నిలవబోతున్నాయట. రీసెంట్ గా చిత్రీకరించిన ప్రభాస్-మాళవిక మోహనన్ మధ్యన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని, ఈ లవ్ ట్రాక్ లో కామెడీ మిక్స్ చెయ్యడంతో ఈ సీన్స్ హైలెట్ గా నిలవబోతున్నాయని మూవీ యూనిట్ చెబుతుంది. ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ K షూటింగ్స్ తో పాటుగా అప్పుడప్పుడు మారుతి మూవీ షూటింగ్ చేస్తూ వస్తున్నాడు.
ఈ ఏడాది చివరికల్లా మారుతీతో చేస్తున్న రాజా డీలక్స్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది అంటున్నారు. ఇంకా ఈ చిత్రంలో ప్రభాస్ కి తాతయ్యగా KGF విలన్ సంజయ్ దత్ నటిస్తున్నారు. ప్రభాస్ బర్త్ డే కి ఫస్ట్ లుక్ తోనే ప్రభాస్ ని కూల్ చేసే ఏర్పాట్లు మారుతి చేస్తున్నట్లుగా సమాచారం.