Advertisementt

సిడ్నీలో ఎంజాయ్ చేస్తున్న జబర్దస్త్ కమెడియన్

Wed 26th Apr 2023 04:16 PM
jabardasth,adhire abhi  సిడ్నీలో ఎంజాయ్ చేస్తున్న జబర్దస్త్ కమెడియన్
Jabardasth comedian enjoying in Sydney సిడ్నీలో ఎంజాయ్ చేస్తున్న జబర్దస్త్ కమెడియన్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ స్టేజ్ పై కామెడీ చేస్తూ వెండితెర మీద అవకాశాలు వచ్చినా.. జబర్దస్త్ కామెడీ షోనే కంటిన్యూ చేస్తున్న చాలామంది కమెడియన్స్ ఆర్ధికంగా ఎదిగారు. కొత్త ఇల్లు, కొత్త కారులతో కళకళలాడుతున్నారు. ఇక కొంతమంది జబర్దస్త్ ని వదిలి వేరే ఛానల్ చూసుకుంటున్నారు. మరికొంతమంది సిల్వర్ స్క్రీన్ పై బిజీ అవుతున్నారు. అయితే కొన్నేళ్లుగా జబర్దస్త్ ని పట్టుకుని వేళ్ళాడుతున్న వారు కొద్దిరోజుల క్రితం జబర్దస్త్ కి బై బై చెప్పేసి వేరే ఛానల్ కి వెళ్లిపోయారు. 

అందులో అదిరే అభి ఒకరు. అదిరే అభి మంచి సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని ఈటివి జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా టీమ్ లీడర్ గా సత్తా చాటారు. గత పదేళ్లుగా అదిరే అభిగా జబర్దస్త్ లోనే ఉన్న అభి.. తర్వాత జబర్దస్త్ వదిలేసి స్టార్ మా ఛానల్ లో తేలాడు. కానీ స్టార్ మా లో అభి అంతగా సక్సెస్ అయితే అవ్వలేదు. తర్వాత హీరోగా సినిమా చేసాడు. అది సక్సెస్ అవ్వలేదు. ఇక ఇప్పుడు అభి ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్నాడు.

సిడ్నీలో అభి చక్కర్లు కొడుతున్నాడు. అక్కడి నుండి ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అభి సిడ్నీ నగరంలో ఎంజాయ్ చేస్తూ ఆ ప్రదేశాల విశిష్టని గురించి చెబుతూ ఫొటోలకి ఫోజులిచ్చాడు.

Jabardasth comedian enjoying in Sydney:

Jabardasth comedian Adhire Abhi enjoying in Sydney

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ