యంగ్ ఎన్టీఆర్-అల్లు అర్జున్ మధ్యన ఎవరూ చూడని స్నేహం ఉందనేది.. మొన్న అల్లు అర్జున్ బర్త్ డే రోజున సోషల్ మీడియాలో తేటతెల్లమైంది. అల్లు అర్జున్ కి ప్రేమతో బావా హ్యాపీ బర్త్ డే అని ఎన్టీఆర్ ట్వీట్ చేస్తే.. థాంక్స్ బావ అని అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. ఒట్టి థాంక్సేనా.. పార్టీ లేదా పుష్ప అని ఎన్టీఆర్ స్పందిస్తే.. వస్తున్నా అంటూ బన్నీ బదులు ఇవ్వడం అల్లు, ఎన్టీఆర్ ఫాన్స్ కి మాత్రమే కాదు.. ప్రేక్షకులందరికీ బాగా నచ్చేసింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ #NTR30 షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నారు.
అక్కడ స్పెషల్ సెట్ లో షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 సెట్స్ లో అడుపెట్టారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ పుష్ప 2 కోసం ఓ కొత్త సెట్ ని ఫిలిం సిటీలో నిర్మించారు మేకర్స్. అలాగే పుష్ప 2 సెట్స్ లో సుకుమార్ కానీ, అల్లు అర్జున్ కానీ లేరు. ప్రస్తుతం సుకుమార్, మైత్రి మూవీస్ పై ఐటి రైడ్స్ జరగడంతో పుష్ప 2 షూటింగ్ కి విరామం ఇచ్చారు.
తన షూటింగ్ అక్కడే జరగడంతో ఎన్టీఆర్ పక్కనే ఉన్న పుష్ప 2 సెట్స్ లోకి వెళ్లి వచ్చారట. ఎన్టీఆర్ పుష్ప సెట్స్ లోకి కాలు పెట్టిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప 2 సెట్స్ లో ఎన్టీఆర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.