Advertisementt

అఖిల్ మెడపై పొన్నియన్ సెల్వన్ కత్తి

Thu 27th Apr 2023 01:52 PM
maniratnam,ponniyin selvan 2,akhil agent  అఖిల్ మెడపై పొన్నియన్ సెల్వన్ కత్తి
Ponniyin Selvan 2 vs Agent అఖిల్ మెడపై పొన్నియన్ సెల్వన్ కత్తి
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ తర్వాత లాంగ్ గ్యాప్ తో రేవు ఏజెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీపై అక్కినేని అభిమానులు భారీ హోప్స్ పెట్టుకున్నారు. గత పది రోజులుగా ఏజెంట్ ప్రమోషన్స్ తో టీమ్ హడావిడి చేస్తుంది. అఖిల్ సోలో ఇంటర్వూస్, టీమ్ ప్రెస్ మీట్స్ అంటూ హంగామా బాగానే ఉంది. అయితే అఖిల్ కి ఇప్పుడు తమిళం నుండి పొన్నియన్ సెల్వన్ పోటీకి వస్తుంది.

అంటే పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 తెలుగులో హిట్ అవ్వకపోయినా.. మేకర్స్ పాన్ ఇండియా రిలీజ్ లో భాగంగా ఈ చిత్రాన్ని తెలుగులోనూ బాగానే ప్రమోట్ చేసి విడుదల చేస్తున్నారు. అందుకే అఖిల్ ఏజెంట్ కి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం పొన్నియన్ సెల్వన్ వలన తగ్గుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఈ రెండు సినిమాలకి బుక్ మై షోలో పెద్దగా బుకింగ్స్ కనిపించడం లేదు. అఖిల్ ఏజెంట్ కి పాజిటివ్ టాక్ వస్తే తప్ప మేకర్స్ సేవ్ అవ్వరు. 

ఇక హైదరాబాద్ లాంటి మహానగరంలో చాలామంది తమిళులు ఉండడమే కాదు.. మణిరత్నం సినిమాలకి స్పెషల్ అభిమానులు ఉంటారు. వారు గనక పొన్నియన్ సెల్వానికి ఓటేస్తే అఖిల్ కి కష్టమే. చూద్దాం రేపు జరగబోయే బాక్సాఫీసు ఫైట్ లో మణిరత్నం పొన్నియన్ సెల్వన్ గెలుస్తుందా? లేదంటే అఖిల్ ఏజెంట్ గెలుస్తుందా? అనేది.

Ponniyin Selvan 2 vs Agent:

Maniratnam Ponniyin Selvan 2 vs Akhil Agent

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ