Advertisementt

సైలెంట్ గా ఓటిటిలోకి రావణాసుర

Fri 28th Apr 2023 12:19 PM
ravi teja,ravanasura  సైలెంట్ గా ఓటిటిలోకి రావణాసుర
Ravanasura silently entered the OTT సైలెంట్ గా ఓటిటిలోకి రావణాసుర
Advertisement
Ads by CJ

రవితేజ రీసెంట్ మూవీ రావణాసుర ఏప్రిల్ 7 న విడుదలై అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అంతకుముందు ధమాకా, వాల్తేర్ వీరయ్య సినిమాలు హిట్ అవడంతో రవితేజ రావణాసురపై అంచనాలు వచ్చేసాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ-సుశాంత్ నటించిన ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవ్వుద్ది అనుకున్నారు. కానీ రవితేజకి హీరోగా, నిర్మాతగానూ రావణాసుర భారీ షాకిచ్చింది. థియేటర్స్ లో రెండోరోజే రావణాసుర బండారం తేలిపోయింది. 

ఇక థియేటర్స్ లో విడుదలైన మూడు వారలు తిరక్కుండానే ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చేసింది. రావణాసుర డిజిటల్ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సైలెంట్ గా అంటే ఎలాంటి హడావిడి లేకుండానే రావణాసురుని ఓటిటిలో స్ట్రీమింగ్ చేసారు. ఈ రోజు అంటే ఏప్రిల్ 28 నుండి రావణాసుర అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్స్ లో ప్లాప్ అయిన రావణాసుర ఓటిటి పెరఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి!

Ravanasura silently entered the OTT:

Ravi Teja Ravanasura is now streaming

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ