సాయి ధరమ్ తేజ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు తెరకెక్కించిన విరూపాక్ష చిత్రం గత శుక్రవారం విడుదలైంది. పబ్లిక్ నుండి, క్రిటిక్స్ నుండి ఓవరాల్ గా పాస్ మార్కులు వేయించుకున్న విరూపాక్ష కలెక్షన్స్ పరంగా సాయి ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. మొదటి వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకున్న విరూపాక్ష ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్లబోతుంది. తమిళ, మలయాళ, హిందీ. భాషలో మే మొదటి వారంలో విడుదల కాబోతుంది.
ఇక వారం రోజులుగా ఆడియన్స్ పాజిటివ్ టాక్ తో లాభలు మూటగట్టుకుంటున్న విరూపాక్షకి మరో వారం కలిసొచ్చింది. ఎందుకంటే ఈరోజు ఏప్రిల్ 28 న విడుదలైన అఖిల్ ఏజెంట్ కి డిసాస్టర్ టాక్ రాగా.. పొన్నియన్ సెల్వానికి 2 కి సో సో టాక్ వచ్చింది. అఖిల్ ఏజెంట్ పై వస్తున్న నెగిటివిటి చూస్తే ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారంటే నమ్మకం కుదరడమే లేదు. ఇక తమిళ్ లో హిట్ అంటున్న పొన్నియన్ సెల్వన్2 తెలుగు ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించడం అనేది కలే.
సో ఈ వారం కూడా ప్రేక్షకులకి బెస్ట్ ఛాయస్ విరూపాక్షనే కనిపిస్తుంది. మరి గత వారం మిస్ అయిన ప్రేక్షకులు ఈ వారం కొత్త సినిమాల్ని పక్కనబెట్టి విరూపాక్షకి ఓటేస్తే.. సాయి ధరమ్ కి మరింతగా కలిసి రావడం పక్కా.
విరూపాక్ష డే వైజ్ AP TG షేర్స్
👉Day 1: 4.79CR
👉Day 2: 5.80CR
👉Day 3: 5.77CR
👉Day 4: 3.01CR
👉Day 5: 2.40CR
👉Day 6: 1.84CR
👉Day 7: 1.50CR
AP-TG Total:- 25.11Cr (43.40Cr Gross)