Advertisementt

ఏజెంట్ ఓటిటి పార్ట్నర్ అండ్ డేట్ రివీల్డ్

Sat 29th Apr 2023 11:31 AM
akhil akkineni,agent  ఏజెంట్ ఓటిటి పార్ట్నర్ అండ్ డేట్ రివీల్డ్
Agent OTT Partner Revealed ఏజెంట్ ఓటిటి పార్ట్నర్ అండ్ డేట్ రివీల్డ్
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని లేటెస్ట్ ఫిలిం ఏజెంట్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి కలెక్షన్స్ కోసం కిందా మీదా పడుతుంది. అంచనాల మధ్యన విడుదలై ఆ అంచనాలు అందుకోలేక చేతులెత్తేసింది. మమ్ముట్టి, అఖిల్ ఎఫర్ట్స్ తప్ప ఏజెంట్ లో పనికొచ్చే అంశాలే లేవంటూ ప్రేక్షకులు ఏజెంట్ ని తిట్టిపోస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన ఏజెంట్ మూవీ డిజిటల్ హక్కులని సోని లివ్ దక్కించుకుంది. 

భారీ అంచనాలున్న ఏజెంట్ ని భారీ డీల్ కే సోని లివ్ దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏజెంట్ డిసాస్టర్ అవడంతో ఇప్పుడు ఈ మూవీ కూడా మూడు వారాల్లోనే ఓటిటిలో ప్రత్యక్షమయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అనే టాక్ నడుస్తుంది. ఈమధ్యన హిట్ అయిన సినిమాలే నెలలోపే ఓటిటిలోకి వచ్చేస్తుంటే ఫట్ అయిన సినిమాలకు రెండు వారాలు కూడా అక్కర్లేదు అంటున్నారు. 

లేటెస్ట్ గా రావణాసుర థియేటర్స్ లో ప్లాప్ అవ్వగా.. మూడు వారాలు తిరక్కుండానే ఓటిటిలో ప్రత్యక్షమైంది. సో అఖిల్ ఏజెంట్ కూడా అదేమాదిరి మూడు వారాల్లోపే ఓటిటిలోకి వచ్చేసే అవకాశం ఉంది.

Agent OTT Partner Revealed:

Akhil Akkineni Agent locks its OTT partner

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ