మహానటితో హీరోయిన్‌గా అందరి మదిలో గుర్తుండిపోయే కేరెక్టర్‌లో మెరిసిన కీర్తి సురేష్ తర్వాత ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకుంది కానీ.. మహానటి సక్సెస్‌ని మాత్రం కొనసాగించలేకపోయింది. వరస వైఫల్యాలతో గ్లామర్‌గా టర్న్ అయ్యింది. పద్దతికి పెట్టింది పేరు అనుకున్న కీర్తి సురేష్ రెండుమూడేళ్లుగా అందాల ఆరబోతకు దిగింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కీర్తి సురేష్ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటో షూట్స్ షేర్ చేస్తోంది.
రీసెంట్‌గా హీరో నానితో చేసిన దసరా పాన్ ఇండియా హిట్ అవడంతో కీర్తి సురేష్ పేరు మోగిపోయింది. వెన్నెలగా కీర్తి సురేష్ నటనని తెలంగాణానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మెచ్చుకున్నారు. దసరాతో కమర్షియల్ హిట్ అందుకున్న కీర్తి సురేష్‌కి ఇకపై స్టార్ హీరో అవకాశాలు పక్కా అని అనుకుంటున్నారు. మరి దసరా ఆమె రేంజ్ ఎంత మార్చిందో అనేది అమెకొచ్చే అవకాశాలు డిసైడ్ చేస్తాయి.
తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే మోడరన్‌గా ట్రెడిషనల్‌గా కీర్తి సురేష్ లుక్స్ ఉన్నాయి. ఎల్లో డ్రెస్‌లో మెస్మరైజ్ చేసే బ్యూటీతో మురిసిపోయిన కీర్తి సురేష్.. మోడరన్ డ్రెస్‌లో గ్లామర్‌గా కనిపించింది. కీర్తి సురేష్ గ్లామర్‌పై మీరూ ఓ లుక్కేయండి.