Advertisementt

దగ్గుబాటి హీరోకే ఇన్ని కష్టాలా?

Sat 13th May 2023 01:30 PM
daggubati abhiram,teja,ahimsa,release troubles  దగ్గుబాటి హీరోకే ఇన్ని కష్టాలా?
Daggubati Hero Movie in Release Troubles దగ్గుబాటి హీరోకే ఇన్ని కష్టాలా?
Advertisement
Ads by CJ

దగ్గుబాటి వారి ఇంటి నుండి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడంటే అతనిపై ఎంతగా అంచనాలు ఉంటాయి. దగ్గుబాటి అభిమానుల్లో ఎన్ని హోప్స్ ఉంటాయి. వెంకటేష్ సీనియర్ స్టార్స్ లిస్ట్‌లోకి వెళ్లగా.. రానా ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా కొనసాగుతున్నాడు. రానా తమ్ముడు అభిరామ్ అహింసతో హీరోగా సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. దర్శకుడు తేజ అభిరామ్‌ని హీరోగా పరిచయం చేసే బాధ్యతలు తీసుకున్నాడు. అహింస సినిమా షూట్ పూర్తవడమూ, రిలీజ్ డేట్ ఇవ్వడం ఎప్పుడో జరిగిపోయింది.

కానీ అహింస రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యాక మళ్ళీ కొత్త డేట్ ఇవ్వలేదు. మొన్న ఉగాదికి తేజ-అభిరామ్‌ల ఇంటర్వూస్ కూడా పూర్తయ్యాయి. ప్రమోషన్స్ మొదలు పెట్టి ఆపేశారు. ఏదో చిన్నా చితక హీరో అయితే అనుకోవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ ఫ్యామిలీ అయిన దగ్గుబాటి వారి వారసుడు. అలాంటి హీరో సినిమాకే ఇన్ని కష్టాలా.. అన్నట్లుగాగా అహింస పరిస్థితి తయారైంది. 

మరి అహింస ఎందువలన విడుదల ఆలస్యమవుతుందో అనేది సగటు ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యే ఉంటుంది.. కానీ దగ్గబాటి వారికే విషయం అర్ధం కావడం లేదు. తాజాగా తేజ తన ఇంటర్వ్యూలో ఏదో లేపాలని ప్రయత్నించినా.. విషయం ఏమిటో ఈపాటికే ఇండస్ట్రీకి అర్థమైందిలే అనేలా అహంసపై టాక్ వస్తుండటం గమనార్హం.  

Daggubati Hero Movie in Release Troubles:

No Release Update From Daggubati Abhiram Ahimsa Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ