Advertisementt

అఖిల్ నెక్స్ట్ ఆ డైరెక్టర్‌తోనా?

Sat 13th May 2023 05:18 PM
akhil next film,agent,debut director,anil kumar,dasara director  అఖిల్ నెక్స్ట్ ఆ డైరెక్టర్‌తోనా?
Akhil Next Film With Debut Director అఖిల్ నెక్స్ట్ ఆ డైరెక్టర్‌తోనా?
Advertisement
Ads by CJ

అఖిల్ ప్రస్తుతం ఏజెంట్‌తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఏజెంట్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడని అనుకున్న అక్కినేని అభిమానులని అఖిల్ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ సినిమాతో అభిమానుల ఆశలను అడియాశలు చేసిన అఖిల్ చేయబోయే తర్వాత సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అని అమల అక్కినేని హామీ ఇస్తుంది. ఏజెంట్ పై వస్తున్న ట్రోల్స్ పై ఆమె ఓపెన్ లెటర్‌తో స్పందించిన విషయం తెలిసిందే.

అయితే అఖిల్ తదుపరి మూవీపై చాలా రకాల వార్తలు వినిపించాయి. దసరా దర్శకుడు నెక్ట్ అఖిల్‌తోనే అంటూ ఏజెంట్ విడుదలకు ముందే న్యూస్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే తాజాగా అఖిల్ నెక్స్ట్ లైనప్ లోకి అనిల్ కుమార్ అనే నూతన దర్శకుడు వచ్చి చేరాడు. అతను సాహో‌కి రైటర్ గా, అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసాడు. అయితే అనిల్ కుమార్‌కి అఖిల్ సినిమా చేసే అవకాశం ఇస్తాడా.. డెబ్యూ డైరెక్టర్‌ని నమ్మి ముందుకు వెళతాడా అనేది తెలియాల్సి ఉంది.

కానీ అనిల్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ సినిమా పక్కా అని.. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుంది అంటూ ఓ గాలి వార్త అయితే ఫిలిం సర్కిల్స్‌లో నడుస్తుంది. చూద్దాం.. అఖిల్ తదుపరి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో..?

Akhil Next Film With Debut Director :

After Agent Result, Rumours viral on Akhil Next Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ