ఢీ డాన్స్ మాస్టర్ చైతన్య నిన్న సూయిసైడ్ చేసుకొవడం డాన్స్ లవర్స్ ని కలిచివేసింది. నిన్నగాక మొన్న బుధవారం ఢీ స్టేజ్ పై తన కంటెస్టెంట్ తో పాటుగా డాన్స్ చేసి శేఖర్ మాస్టర్, శ్రద్ద దాస్ తో శెభాష్ అనిపించుకున్న చైతన్య ఈరోజు లేకపోవడం ఢీ షోలో పని చేసే ప్రతి ఒక్కరికి తీరని లోటుగానే కనిపిస్తుంది. అయితే డాన్స్ మాస్టర్ చావుకు కారణం అతని చేసిన అప్పులే అని తెలుస్తుంది. అతను అప్పులు కట్టలేకే సూయిసైడ్ చేసుకున్నట్టుగా వీడియో రియాక్ర్డ్ చెయ్యడం కలకలం సృష్టించింది.
ఢీ డాన్స్ షోలో పని చేస్తే పెద్దగా డబ్బు ఇవ్వరు.. అదే జబర్దస్త్ లో కామెడీ చేసే వారికి యాజమాన్యం బాగా పారితోషకాలు ఇస్తుంది.. నేను చేసిన అప్పులు, వడ్డీలు కట్టలేకే సూయిసైడ్ చేసుకుంటున్నట్టుగా చైతన్య వీడియో చేసి ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసింది. కండక్టర్ ఝాన్సీ చైతన్య ఆత్మహత్యపై ఎమోషనల్ అయ్యింది. చైతన్య అన్నయ్య ఎంతవుపని చేసావు. అప్పులు ఉంటె కూర్చుని మాట్లాడుకోవాలి కానీ ఇలా ప్రాణం తీసుకుంటావా.. ఆయన అందరికి హెల్ప్ చేస్తాడు.
చైతన్య చాలామందివాడు. నేను కొద్దిరోజుల క్రితం అతన్ని కలిసాను. నాకు ఢీ డాన్స్ షో స్టేజ్ పై కనిపించాలని ఉంది అని అడిగితే నాకు నెక్స్ట్ సీజన్ లో ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్పాడు. తోటి వారికి సాయం చేసే చైతన్య అన్నయ్య ఇలా అకాలమరణం చెందడం బాధకారమంటూ ఝాన్సీ స్పందించింది.