రష్మిక మందన్న సినిమా షూటింగ్స్ తోనే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే సెలెబ్రిటీ. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్స్ ఉన్న సెలబ్రిటీస్ లో ఒక్కరిగా కొనసాగుతున్న రష్మిక తన సినిమా అప్ డేట్స్ దగ్గర నుండి గ్లామర్ అవుట్ ఫిట్స్ వరకు తాను చేసే ప్రతి పనిని అభిమానులతో పంచుకుంటుంది. అయితే కొద్దిరోజులుగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్న రష్మిక మళ్ళీ యాక్టీవ్ అయ్యింది. అసోషల్ మీడియాకి గ్యాప్ ఇచ్చినందుకు సారి చెబుతూ మిమ్మల్ని మిస్ అయ్యాను అంటూ మొదలుపెట్టేసింది.
తాను కొద్దిరోజులుగా నెట్ వర్క్ లేని ఏరియాలో షూటింగ్ చేయడంతోనే తాను అందరిని మిస్ అయినట్లుగా చెప్పింది. తెలుగు, తమిళంలో బైలింగువల్ మూవీగా చేస్తున్న రైన్ బో షూటింగ్ కోసం ఈ మధ్యన రష్మిక నెట్ వర్క్ లేని ప్రాంతానికి వెళ్లిందట. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తవడంతో రష్మిక మళ్ళీ నెట్ వర్క్ ఉన్న ప్రాంతంలోకి వచ్చి ఇలా చెప్పుకొచ్చింది. కొద్దిరోజులుగా మిమ్మల్ని మిస్ అయ్యాను.. సారి.. అంటూ షూటింగ్ విషయాలను షేర్ చేసింది.
కొన్ని రోజులు రైన్ బో షూటింగ్ చెన్నై లో చేసాము. తర్వాత కోడై కెనాల్ వెళ్ళాము, తదుపరి షెడ్యూల్ మున్నార్ లో మొదలు పెట్టాము.. ఈ రెండు ప్రాంతాల్లోనూ నెట్ వర్క్ లేక మీకు అందుబాటులోకి రాలేదు. కోడై కెనాల్ లో నా గది నుండి సూర్యోదయం చూస్తుంటే ఆ ఫిలింగ్ చెప్పలేను.. ప్రస్తుతం వరకు చాలా కూల్ గా షూటింగ్ జరిగింది అంటూ రష్మిక ఏకరువు పెట్టింది.